BJP Meeting: నిర్మల్‌లో కేంద్ర మంత్రి అమిత్‌షా సభ సక్సెస్‌

BJP Meeting: సభకు భారీగా తరలివచ్చిన జనం * కాషాయవర్ణంతో నిండిన నిర్మల్‌ పట్టణం

Update: 2021-09-18 02:02 GMT
Central Minister Amit Shah Public Meeting Was Success in Nirmal

నిర్మల్ లో కేంద్ర మంత్రి అమిత్ షా సభ సక్సెస్ (ఫైల్ ఇమేజ్)

  • whatsapp icon

BJP Meeting: నిర్మల్‌లో చేపట్టిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా సభ సక్సెస్‌ అయ్యింది. సభకు భారీ ఎత్తున జనం తరలొచ్చి జేజేలు పలికారు. సుమారు 70వేల మంది వరకు సభకు తరలి రావడం.. ఆ పార్టీలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. నిర్మల్‌ జిల్లా నుంచే కాకుండా ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిజామాబాద్‌, కామారెడ్డి, జగిత్యాల, కరీంనగర్‌ జిల్లాల నుంచి సైతం పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తలు, నాయకులు తరలొచ్చారు. దీంతో నిర్మల్‌ పట్టణమంతా కాషాయవర్ణంతో నిండిపోయింది.

తెలంగాణలో కారు కేసీఆర్‌దైతే, స్టీరింగ్‌ ఒవైసీ చేతిలో ఉందని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా విమర్శించారు. ఒవైసీకి భయపడి విమోచన దినోత్సవాన్ని కేసీఆర్‌ అధికారికంగా నిర్వహించడం లేదని ఆరోపించారు. రాష్ట్రంలో మతం ఆధారిత రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమని, దీనికి బీజేపీ ఒప్పుకోబోదన్నారు. ఈ రిజర్వేషన్లను వెంటనే రద్దు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. తెలంగాణలో డబ్బు, కుటుంబ రాజకీయాలను తరిమికొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. తెలంగాణ సాయుధపోరాట వీరుల త్యాగాలు మరిచిపోదమా.. అంటూ కేసీఆర్ను విమర్శించారు. సెప్టెంబరు 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని తప్పకుండా నిర్వహిస్తామన్నారు.  

Tags:    

Similar News