Hyderabad: పిచ్చి పీక్స్.. రీల్స్‌ కోసం పోలీస్‌స్టేషన్‌నూ వదలని ఆకతాయిలు.. చివరకు..

Hyderabad: ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ పిచ్చి ఆ యువకులను కేసులోకి నెట్టివేసింది. ఉప్పల్ పోలీస్ స్టేషన్ ఆవరణలో కొంతమంది ఆకతాయిలు రెచ్చిపోయారు.

Update: 2024-09-21 06:09 GMT

Hyderabad: పిచ్చి పీక్స్.. రీల్స్‌ కోసం పోలీస్‌స్టేషన్‌నూ వదలని ఆకతాయిలు.. చివరకు..

Hyderabad: ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ పిచ్చి ఆ యువకులను కేసులోకి నెట్టివేసింది. ఉప్పల్ పోలీస్ స్టేషన్ ఆవరణలో కొంతమంది ఆకతాయిలు రెచ్చిపోయారు. కొంతమంది పిచ్చి చేష్టలతో... రీల్స్ చేశారు. ఈ రీల్స్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ముగ్గురిపై ఉప్పల్ పోలీసులు కేసు నమోదు చేశారు.

హైదరాబాద్‌లోని ఉప్పల్ పోలీస్ స్టేషన్‌ కాంపౌండ్‌లో ఇద్దరు యువకులు రీల్ క్రియేట్ చేశారు. దానిని సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అది కాస్త వైరల్ అయింది. దీంతో పోలీసుల పట్ల అనుచితంగా ప్రవర్తించారని అధికారులు చర్యలు తీసుకున్నారు. ఏ-1 బల్వీర్‌సింగ్‌తో పాటు మరో ఇద్దరు వ్యక్తులపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. సోషల్‌మీడియాలో లైకులు, ఫాలోవర్ల కోసం ఇలాంటి ఆకతాయి పనులు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.


Tags:    

Similar News