రాజేంద్రనగర్‌లో... ఓయూ స్టూడెంట్స్ ప్రచారం

Rajendranagar: నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలంటే కాంగ్రెస్‌కు ఓటేయాలని వినతి

Update: 2023-11-21 09:55 GMT

రాజేంద్రనగర్‌లో... ఓయూ స్టూడెంట్స్ ప్రచారం

Rajendranagar: నిరుద్యోగులకు బీఆర్ఎస్ పార్టీ చేసిన అన్యాయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుకు పెట్టుకుని ఓటు వేయాలని రాజేంద్రనగర్ నియోజకవర్గంలో ఉస్మానియా యూనివర్శిటీ విద్యార్థులు ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని గ్రామాల్లో ఇంటింటకీ తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు. ప్రతి ఇంట్లో ఉన్నత చదువులు చదువుకుని... ఉద్యోగాలు రాక... ఇంట్లో ఖాళీగా ఉంటున్నారని, వాళ్ల ముఖం చూసి అయినా... వారికి ఉద్యోగాలు రావాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని వారు కోరారు. పింఛన్లకు, పథకాలకు మోసపోవద్దని, విద్యార్థులకు ఉద్యోగాలు రావాలంటే మీ అమూల్యమైన ఓటు కాంగ్రెస్ పార్టీకి వేయాలంటూ ప్రచారం చేశారు విద్యార్థులు.

Tags:    

Similar News