BRS Public Meeting: రేపు పరేడ్ గ్రౌండ్ లో బీఆర్ఎస్ బహిరంగ సభ రద్దు
BRS Public Meeting: వర్షం కారణంగా సభను రద్దు చేసిన బీఆర్ఎస్
BRS Public Meeting: సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో రేపు జరగాల్సిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభ రద్దైంది. వర్షం కారణంగా సభను రద్దు చేస్తున్నట్లు బీఆర్ఎస్ నాయకులు తెలిపారు. ఇప్పటికే సభ ఏర్పాట్లు పూర్తి కాగా.. మరో రెండు రోజుల పాటు వర్షం ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో బీఆర్ఎస్ పార్టీ సభను రద్దు చేసింది.
పోలింగ సమయం దగ్గరపడుతున్న కొద్దీ గులాబీ బాస్ ప్రచారంలో వేగం పెంచారు. బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభ పేరుతో బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్‌లో ఎమ్మెల్యేల గెలుపు కోసం సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో సభకు ప్లాన్ చేశారు. అయితే అనూహ్యంగా చివరి నిమిషంలో సభ రద్దయ్యింది. వర్షం కారణంగా రేపటి సభను రద్దు చేసినట్లు పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది.