Talasani Srinivas Yadav: సనత్ నగర్‌లో బీఆర్ఎస్ భారీ ఆధిక్యంతో విజయం సాధించడం ఖాయం
Talasani Srinivas Yadav: సికింద్రాబాద్‌లోని నార్త్ జోన్ జీహెచ్ఎంసి కార్యాలయంలో నామినేషన్ దాఖలు
Talasani Srinivas Yadav: హైదరాబాద్ సనత్‌నగర్ బీఆర్ఎస్ అభ్యర్థిగా తలసాని శ్రీనివాస్ యాదవ్ నామినేషన్ దాఖలు చేశారు. పార్టీ కార్యకర్తలతో భారీ ర్యాలీగా వచ్చిన ఆయన.. అనంతరం నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారికి అందజేశారు. నామినేషన్ దాఖలు చేయడానికి బయల్దేరే ముందు తలసాని మారేడుపల్లిలోని తన నివాసంలో తన తల్లి లలితా దగ్గర ఆశీర్వచనాలు తీసుకున్నారు. అక్కడి నుంచి ర్యాలీగా ఉజ్జయిని మహంకాళి ఆలయానికి వెళ్లారు. సనత్ నగర్‌లో బీఆర్ఎస్ భారీ ఆధిక్యంతో విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు తలసాని.