తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ ధర్నాలు
* రైతు కల్లాల నిర్మాణంలో నిధులు వెనక్కి ఇవ్వాలన్న కేంద్రం.. రైతు వ్యతిరేక విధానాలకు పాల్పడుతోందని బీఆర్ఎస్ నిరసన
BRS: కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ చేపట్టిన ధర్నా తెలంగాణ వ్యాప్తంగా కొనసాగుతోంది. రైతు కల్లాల నిర్మాణంలో నిధులు వెనక్కి ఇవ్వాలన్న కేంద్ర నిర్ణయాన్ని తెలంగాణ ప్రభుత్వం తప్పుబట్టింది. ఈ మేరకు రైతు మహా ధర్నా పేరిట నిరసనలు చేపట్టింది. మేడ్చల్ జిల్లాలో ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ఆధ్వర్యంలో ధర్నా చేపట్టగా ఆయన మినహా ఎమ్మెల్యేలంతా డుమ్మా కొట్టారు. మరోవైపు మంత్రి మల్లారెడ్డి ఆయన కాలేజీలో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశారు. కేంద్రంలో ఉన్న బీజేపీ.. రైతు వ్యతిరేక విధానాలకు పాల్పడుతోందని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు.