Adilabad: ఆదిలాబాద్ జిల్లాలో పత్తి కొనుగోళ్లకు బ్రేక్
Adilabad: తేమ శాతంపై రైతులకు, వ్యాపారులకు కుదరని ఏకాభిప్రాయం
Adilabad: ఆదిలాబాద్ జిల్లాలో పత్తి కొనుగోలు ప్రారంభం రోజునే బ్రేక్ పడింది. ఇటు వ్యాపారులకు, అటు రైతులకు పత్తిలో తేమ శాతం విషయమై ఏకాభిప్రాయం కుదరకపోవడంతో కొనుగోళ్లు నిలిచిపోయాయి. ఈ ఉదయం మార్కెట్‌లో జరిగిన బిట్‌లో పత్తికి 7 వేల 970 రూపాయల మద్దతు ధర పలకగా 12 శాతానికి తేమ మించవద్దని వ్యాపారులు చెప్పడంతో రైతులు ఆందోళనకు దిగారు. ఇటీవల కురిసిన వర్షాలకు పత్తిలో తేమ శాతం మోతాదుకు మించి ఉండటం సహజమని అన్నారు. తేమ శాతాన్ని పరిగణలోకి తీసుకోకుండా కొనుగోళ్లు చేయాలని రైతులు డిమాండ్ చేశారు.