Bandi Sanjay: కరీంనగర్‌కు మోడీ చేసిన పనులను వివరించడమే ఉద్దేశం
Bandi Sanjay: కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని ఏడు సెగ్మెంట్లలో పాదయాత్ర
Bandi Sanjay: కరీంనగర్ పార్లమెంట్‌కు ప్రధాని మోడీ ఏం చేశారో ప్రజలకు వివరించడమే తన యాత్ర ముఖ్య ఉద్దేశమన్నారు బీజేపీ ఎంపీ బండి సంజయ్. జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో ప్రజాహిత యాత్రను చేపట్టబోతున్నట్లు ఆయన తెలిపారు. కేంద్ర ప్రభుత్వ నిధులను కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దారి మళ్లించిందని ఆరోపించారు. మోడీని మూడోసారి ప్రధాని చేయాలని ప్రజలను కోరడమే యాత్ర ఉద్దేశమన్న బండి సంజయ్.