ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎత్తివేయాలని తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని బీజేపీ అధ్యక్షుడు బండిసంజయ్ తప్పుబట్టారు. కొనుగోలు కేంద్రాలు ఎత్తివేయడంలో కుట్ర దాగి ఉందని బండి సంజయ్ ఆరోపించారు. వెంటనే ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఉన్న మొత్తం రైతు వేదికలన్నింటినీ ధాన్యం కొనుగోలు కేంద్రాలుగా మార్చాలని సీఎం కేసీఆర్‌కు సూచించారు.
నియంత్రిత సాగు విధానం అవసరం లేదని కేసీఆర్ తీసుకున్ననిర్ణయంపై తెలంగాణ బీజేపీ చీఫ్ బండిసంజయ్ మండిపడ్డారు. కేసీఆర్ సలహాను పాటించి నియంత్రిత సాగు చేసిన రైతులందరూ దివాళా తీసారని బండి సంజయ్ అన్నారు. నియంత్రిత సాగు విషయంలో కేసీఆర్ ఎందుకు యూ టర్న్ తీసుకున్నారో ప్రజలకు చెప్పాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.