Bhatti Vikramarka: సంపద కలిగిన తెలంగాణా రాష్ట్రం నేడు అప్పుల పాలైంది

Bhatti Vikramarka: కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే ప్రతి ఒక్కరికీ న్యాయం జరుగుతుంది

Update: 2023-11-21 10:30 GMT

Bhatti Vikramarka: సంపద కలిగిన తెలంగాణా రాష్ట్రం నేడు అప్పుల పాలైంది

Bhatti Vikramarka: ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం గందశిరిలో మధిర కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మల్లు భట్టి విక్రమార్క ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన BRS ప్రభుత్వం పై ధ్వజమెత్తారు. సంపద కలిగిన తెలంగాణా రాష్ట్రం నేడు అప్పుల పాలైందని ఆయన మండిపడ్డారు. నీళ్ల కోసం తెలంగాణా తెచ్చుకుంటే ఒక్క చుక్క నీరు కూడా ఈ ప్రాంతానికి రాలేదన్నారు. లక్ష కోట్లు ఖర్చు చేసి గోదావరిపై కట్టిన కాళేశ్వరం, మేడిగడ్డ ప్రాజెక్టుల పరిస్థితి ఎలా ఉందో ప్రజలకు తెలుసని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే ప్రతి ఒక్కరికీ న్యాయం జరుగుతుందని భట్టి విక్రమార్క అన్నారు.

Tags:    

Similar News