Karimnagar: కరీంనగర్‌లో బీజేపీ ప్రచారం.. ఇంటింటి ప్రచారం చేసిన బండి సంజయ్ కుటుంబ సభ్యులు
Karimnagar: పెద్ద ఎత్తున పాల్గొన్న కార్యకర్తలు
Karimnagar: కరీంనగర్ చైతన్యపురి లో బీజేపీ ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని చేపట్టింది. ముందుగా బీజేపీ పార్లమెంటు సభ్యుడు బండి సంజయ్ కుటుంబ సభ్యులు ప్రచార రథానికి పూజలు నిర్వహించి ప్రారంభించారు. చైతన్యపురి లో ప్రతి ఇంటికీ వెళ్లి ప్రచారాన్ని కొనసాగించారు. బండి సంజయ్ కుటుంబ సభ్యులు మహిళలకు బొట్టు పెట్టి బీజేపీ ఓటు వేయాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు, బండి సంజయ్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.