Bandi Sanjay: కాంగ్రెస్ అభ్యర్థులు గెలిస్తే కొనేయవచ్చిన కేసీఆర్ భావిస్తున్నారు
Bandi Sanjay: కాంగ్రెస్, బీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా ఎక్కడైనా కొట్లాడిందా..?
Bandi Sanjay: సీఎం కేసీఆర్ కాంగ్రెస్ అభ్యర్థులు గెలువాలని చూస్తున్నాడని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు. కాంగ్రెస్ అభ్యర్థులు గెలిస్తే గంప గుత్తగా కొనేయవచ్చని కేసీఆర్ భావిస్తున్నారన్నారు. గతంలో 12మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించారని తెలిపారు. వారందరిని కేసీఆర్ హోల్‌సేల్‌గా కొనేశాడని ఆరోపించారు. కాంగ్రెస్ బీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా ఎక్కడైనా కొట్లాడిందా అని ప్రశ్నించారు. బీజేపీ నిరుద్యో్గ సమస్యపై పోరాడిందని చెప్పారు. తనపై 74 కేసులున్నాయన్నారు బండి సంజయ్. కరీంనగర్ జిల్లా చొప్పదండి అభ్యర్థి బొడిగె శోభ తరపున గంగాధర మండలంలో నిర్వహించిన ప్రచార సభలో బండి సంజయ్ పాల్గొని ప్రసంగించారు.