TG DSC Exams: షెడ్యూల్ ప్రకారమే డీఎస్సీ పరీక్షలు ..ఈనెల 11న హాల్ టికెట్లు రిలీజ్

TG DSC Exams: తెలంగాణలో డీఎస్సీ పరీక్షలు యాథాతథంగా జరుగుతాయని వెల్లడించింది తెలంగాణ పాఠశాల విద్యాశాఖ. షెడ్యూల్ ప్రకారమే ఈనెల 18 నుంచి ఆగస్టు 5 వరకు డీఎస్సీ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపింది.

Update: 2024-07-09 00:08 GMT

TG DSC EXAMS: నేటి నుంచి తెలంగాణ డీఎస్సీ పరీక్షలు షురూ..అభ్యర్థులు ఇవి తప్పకుండా పాటించాల్సిందే

TG DSC Exams:షెడ్యూల్ ప్రకారమే తెలంగాణ డీఎస్సీ పరీక్షలు జరుగుతాయని వెల్లడించింది తెలంగాణ పాఠశాల విద్యాశాఖ. షెడ్యూల్ ప్రకారం ఈనెల 18 నుంచి ఆగస్టు 5వ తేదీ వరకు పరీక్షలను నిర్వహించనున్నట్లు తెలిపింది. అభ్యర్థులు ఈనెల 11న సాయంత్రం 5గంటల నుంచి హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకోవచ్చని పేర్కొన్నది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ఓ ప్రకటన విడుదల చేసింది.

డీఎస్సీ పరీక్షలను వాయిదా వేయాలని గత కొన్నాళ్లుగా అభ్యర్థులు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. టెట్ పరీక్ష నిర్వహించి ఆ వెంటనే డీఎస్సీ నిర్వహిస్తున్నారని..రెండు పరీక్షల సిలబస్ వేర్వేరు ఉండటంతో డీఎస్సీ ప్రిపరేషన్ కు సమయం కావాలంటూ అభ్యర్థులు కోరుతున్నారు. అయినప్పటికీ ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడంతో అభ్యర్థులు సోమవారం విద్యాశాఖ కార్యాలయాన్ని ముట్టడించారు.

అయితే అభ్యర్థుల ఆందోళలనలను ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదు. డీఎస్సీ పరీక్షల వాయిదాను అంగీకరించలేదు. షెడ్యూల్ ప్రకారమే పరీక్షలు నిర్వహించేందుకు మొగ్గు చూపింది. ఈనెల 18 నుంచి ఆగస్టు 5వ తేదీ వరకు డీఎస్సీ పరీక్షలు నిర్వహిస్తామని ప్రకటించింది. దీంతో డీఎస్సీ అభ్యర్థుల ఆందోళన నిరాశగానే ముగిసింది.

కాగా ఈనెల 11వ తేదీ సాయంత్రం 5గంటల నుంచి పాఠశాల విద్య అధికారిక వెబ్ సైట్ నుంచి హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చని విద్యాశాఖ పేర్కొంది. డీఎస్సీని కంప్యూటర్ టెస్ట్ గా నిర్వహించనున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 29న సుమారు 11,062 పోస్టుల భర్తీకి ప్రభుత్వం డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. మార్చి 4 నుంచి జూన్ 20 వరకు దరఖాస్తులను స్వీకరించిన విద్యాశాఖ..ఈనెల 18 నుంచి కంప్యూటర్ ద్వారా పరీక్షను నిర్వహించనుంది. 

Tags:    

Similar News