Arvind Dharmapuri: విద్యార్థినులకు ఉచితంగా లాప్‌టాప్‌లు కూడా ఇస్తాం
Arvind Dharmapuri: అన్నపూర్ణమ్మకు ఓటు వేసి గెలిపించండి
Arvind Dharmapuri: ఉజ్వల పథకం కింద నాలుగు ఉచిత సిలిండర్లు బీజేపీ ఇస్తుందని, విద్యార్ధినులకు ల్యాప్‌టాప్‌లు, వరి క్వింటాలుకు 3 వేల ఒక వంద రూపాయల మద్దతు ధరతోపాటు కిలో తరుగు లేకుండా కొనుగోలు చేస్తామని నిజామాబాద్ ఎంపీ అర్వింద్ అన్నారు. నిజామాబాద్ జిల్లా భీంగల్ మండల కేంద్రంలో బీజేపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన... బాల్కొండ బీజేపీ అభ్యర్థి ఏలేటి అన్నపూర్ణమ్మకు మద్దతుగా ఆయన ప్రచారం నిర్వహించారు.
కేసీఆర్ లాగా వేల రూపాయలు ఇచ్చి తరుగు పేరుతో దోచుకోమన్నారు. బీఆర్ఎస్‌కి ఓటేసినా... కాంగ్రెస్‌కి ఓటేసినా కేసీఆర్‌కే ఓటు వేసినట్టని, అమ్మ లాంటి బీజేపీ అభ్యర్థి అన్నపూర్ణమ్మకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. తానే ఇంజినీరునని కాళేశ్వరం కడితే... నేడు అది కుంగిపోయిందని, లక్ష కోట్ల రూపాయల నిధులు నీటి పాలయ్యాయని అర్వింద్ దుయ్యబట్టారు.