Pawan Kalyan: ఇవాళ కొండగట్టుకు వెళ్లనున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యణ్ నేడు ఉదయం 11 గంటలకు కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించుకోనున్నారు.
Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నేడు ఉదయం 11గంటలకు జగిత్యాల జిల్లాలో ఉన్న కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్లనున్నారు. అక్కడ స్వామివారిని దర్శించుకోనున్నారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ శుక్రవారం బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించారు. ఆలయ పరిసరాలను పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. పవన్ కల్యాణ్ ప్రత్యేక భద్రత ఎస్పీ అర్జున్ శుక్రవారం మధ్యాహ్నం కొండగట్టులో స్వామివారిని దర్శించుకుని పర్యటన ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు.