MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్యాం కేసులో అనూహ్య పరిణామం

MLC Kavitha: డిఫాల్ట్ బెయిల్ పిటిషన్‌ను ఉపసంహరించుకున్న ఎమ్మెల్సీ కవిత

Update: 2024-08-06 13:23 GMT

MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్యాం కేసులో అనూహ్య పరిణామం

MLC Kavitha: ల్లీ లిక్కర్ స్యాం కేసులో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. సీబీఐ కేసుకు సంబంధించి రౌస్‌ అవెన్యూ కోర్టులో దాఖలు చేసిన డీఫాల్ట్‌ బెయిల్‌ పిటిషన్‌ను ఎమ్మెల్సీ కవిత ఉపసంహరించుకున్నారు. కవిత దాఖలు చేసిన పిటిషన్‌పై సోమవారం విచారణ చేపట్టిన న్యాయస్థానం తుది విచారణను బుధవారానికి వాయిదా వేసింది. కానీ, తాజాగా పిటిషన్‌ ఉపంహరించుకుంటున్నట్లు కవిత తరఫున న్యాయవాదులు కోర్టుకు తెలిపారు.

చట్ట ప్రకారం ఇతర ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా కోర్టును ఆశ్రయించే అవకాశం ఉన్నందున పిటిషన్‌ ఉపసంహరించుకుంటున్నట్లు వివరించారు. సీబీఐ ఛార్జిషీట్‌లో తప్పులున్నాయని పేర్కొంటూ, జులై 6న కవిత డీఫాల్ట్‌ బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. అయితే, ఎలాంటి తప్పులు లేవని సీబీఐ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో సీబీఐ దాఖలు చేసిన ఛార్జిషీట్‌ను పరిగణనలోకి తీసుకుంటున్నట్లు జులై 22న ప్రత్యేక కోర్టు ప్రకటించింది. ఈ నెల 9న దీనిపై విచారణ జరపనుంది.

Tags:    

Similar News