రేపు తెలంగాణ పర్యటనకు అమిత్‌షా
Amit Shah: సిద్దిపేట బహిరంగ సభలో పాల్గొననున్న అమిత్ షా
Amit Shah: పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో... కమలం నేతలు ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఇందులో భాగంగానే.. కేంద్ర హోంశాఖమంత్రి అమిత్ షా రేపు తెలంగాణకు రానున్నారు. సిద్ధిపేటలో బీజేపీ ఎన్నికల ప్రచారం సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో అమిత్ షా ప్రసంగించనున్నారు.
సిద్ధిపేటలో అమిత్‌షా బహిరంగసభ కోసం బీజేపీ నేతలు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. ఎల్లుండి ఉదయం 11 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి సిద్దిపేట బయల్దేరి వెళ్తారు. సిద్దిపేట సభలో బహిరంగ సభలో ప్రసంగించిన అనంతరం తిరిగి బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. భోజన విరామం తర్వాత భువనేశ్వర్ బయల్దేరి వెళ్తారు.