Amit Shah: అమిత్ షా తెలంగాణ టూర్‌లో స్వల్ప మార్పులు
Amit Shah: బాన్సువాడకు బదులు సిద్దిపేటకు రానున్న అమిత్ షా
Amit Shah: అమిత్ షా తెలంగాణ టూర్‌లో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ నెల 25న తెలంగాణకు అమిత్ షా రానున్నారు. అయితే.. బాన్సువాడకు బదులు సిద్దిపేటలో అమిత్‌షా ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. మెదక్ బీజేపీ అభ్యర్థి రఘునందనరావుకు మద్దతుగా ఆయన ప్రచారం చేయనున్నారు. ఉదయం 11 గంటలకు సిద్దిపేటలో ఏర్పాటు చేసిన బీజేపీ బహిరంగ సభలో అమిత్ షా ప్రసంగిస్తారు. ఇదిలా ఉంటే.. పార్లమెంట్ ఎన్నికల ప్రచారాన్ని ఉధృతం చేసింది కమలం పార్టీ. ఇందులో భాగంగానే.. ఈ నెల 25 తర్వాత తెలంగాణలో బీజేపీ అగ్రనేతల వరుస పర్యటనలు ఉన్నాయి.