Amit Shah: కాంగ్రెస్ ఎమ్మెల్యేలను గెలిపిస్తే.. కేసీఆర్‌కు అమ్ముడుపోతారు
Amit Shah: కాంగ్రెస్ ఎమ్మెల్యేలను గెలిపిస్తే.. కేసీఆర్‌కు అమ్ముడుపోతారు
Amit Shah: జరగబోయే ఎన్నికలు తెలంగాణ భవిష్యత్తును నిర్దేశించేవి అన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. పదేళ్లుగా అవినీతిలో కూరుకుపోయిన కేసీఆర్ సర్కార్ ను ఈ ఎన్నికల్లో ఇంటికి పంపాలని ఆయన పిలుపునిచ్చారు. మక్తల్ లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన అమిత్ షా.. బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ కు బీటీమ్ అని విమర్శించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను గెలిపిస్తే.. కేసీఆర్ కు అమ్ముడుపోతారని ధ్వజమెత్తారు. రాహుల్ గాంధీని ప్రధానిమంత్రి చేయడానికే కేసీఆర్ పని చేస్తున్నారని అమిత్ షా ఆరోపించారు.