Akbar Sheikh: మలక్ పేటను ఎడ్యుకేషన్ హబ్‌గా మారుస్తా
Akbar Sheikh: మలక్ పేట అభివృద్ధి కోసం హస్తం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలన్న అక్బర్
Akbar Sheikh: కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాగానే చంచల్ గూడ జైలును తీసేసి అక్కడ ప్రభుత్వ ఉన్నత విద్యాలయాలు నిర్మించి మలక్ పేట నియోజకవర్గంను ఎడ్యుకేషన్ హబ్ మారుస్తామని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి షేక్ అక్బర్ తెలిపారు. అఖ్బర్ బాగ్ లోని సూపర్ బజార్, ప్రొఫెసర్స్ కాలనీలో ఆయన ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీ స్కీమ్‌లను ప్రజల్లోకి తీసుకెళుతున్నామని, మలక్ పేటలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరడం ఖాయమైందని తెలిపారు. ఎంఐఎం పాతబస్తీ అభివృద్ధికి విరోధిగా మారిందని ఇక వారిమాటలు చెల్లవని అన్నారు. మలక్ పేట అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు.