Warangal: వినూత్న సవాల్.. అసమానతలు తొలగించిన వారికే ఓటు వేస్తానంటూ పోస్టర్
Warangal: అసమానతలపై వేటు వేసే శక్తి ఉందా అంటూ సవాల్
Warangal: వరంగల్ జిల్లా నెల్లికుదురు మండలానికి చెందిన ఓ ఓటరు వినూత్నంగా రాజకీయ నాయకులకు సవాల్ విసిరాడు. మీకే మా ఓటు వేసే శక్తి ఉంది. సమాజంలో ఉన్న అసమానతలపై వేటు వేసే దమ్ము ఉందా అంటూ సవాల్ విసిరాడు. దీనికి సంబంధించి ఇంటి ద్వారం ముందు పోస్టర్ ఏర్పాటు చేసి అందరి దృష్టి ఆకర్షిస్తున్నాడు. నెల్లికుదుర్ మండలానికి చెందిన హెచ్చు శ్రవణ్ ఔట్ సోర్సింగ్ లో రూరల్ డెవలప్ మెంట్ శాఖలో విధులు నిర్వహిస్తున్నాడు. రాజకీయ నాయకులు ఎన్నికల హామీల్లో ఉచిత పధకాలు ఇస్తూ ప్రజలను ఆర్ధికంగా ఎదుగుదలకు ప్రోత్సహిస్తున్నా కుల మత అసమానతలను నిర్ములించడంలో విఫలం అయ్యారని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. , ఏ నాయకుడు అయితే సమాజంలో ఉన్న అసమానతలను తొలగిస్తామని హామీ ఇస్తారో వారికి మాత్రమే ఓటు వేస్తామని తెలిపారు.