పోచారం ఐటీ కారిడార్ సమీపంలో రోడ్డు ప్రమాదం
అన్నోజిగూడలో రోడ్డుదాటుతుండగా వ్యక్తిని ఢీకొట్టిన కారు
పోచారం ఐటీ కారిడార్ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ వ్యక్తి సెల్‌ఫోన్ మాట్లాడుతూ.. రోడ్డు దాటుతుండగా.. ఓ కారు ఢీకొట్టింది. కారు ఢీకొట్టడంతో.. ఆ వ్యక్తి ఎగిరి... డివైడర్‌పై పడ్డారు. తలకు తీవ్ర గాయాలు కావడంతో.. గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్టు తెలుస్తుంది. మృతుడు అన్నోజిగూడకు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. అయితే.. ఢీకొట్టిన కారు.. అక్కడినుంచి జారుకోవడంతో.. ఆ కారు గురించి.. ఆరా తీస్తున్నారు పోలీసులు.