యువకుడి అజాగ్రత్త..చక్రాల కింద నలిగిపోయిన చిన్నారి

Update: 2020-09-27 15:24 GMT

ఓ వ్యక్తి నిర్లక్ష్యం ఓ చిన్నారి ప్రాణాన్ని తీసింది. కారు నడిపే సమయంలో ముందు ఎవరైనా ఉన్నారా లేదా అని చూడకుండా రావడమే ఓ నిండు ప్రాణం పోవడానికి కారణమైంది. ఈ విశాదకర సంఘటన నిజామాబాద్ జిల్లాల్లోని కంఠేశ్వర్ ప్రాంతంలోని విషాదం చోటు చేసుకుంది. ఈ సంఘటనకు సబంధించి పూర్తివివరాల్లోకెళితే వాచ్‌మెన్‌గా విధులు నిర్వహిస్తున్న వ్యక్తి.. తన కుటుంబంతో కలిసి అపార్ట్‌మెంట్‌ సెల్లార్‌లో నివాసముంటున్నాడు. వాచ్ మెన్ నివాసం ఉంటున్న ప్రాంతంలోనే అపార్ట్‌మెంట్‌ లో నివసించే వారు వారి బైకులు, కార్లను పార్కింగ్ చేస్తూ ఉంటారు. అయితే వాచ్ మెన్ కూతురు 18 నెలల చిన్నారి మనస్వి తమ ఇంటి సమీపంలో ప్రతి నిత్యం లాగే ఈ రోజు కూడా సెల్లార్ లో ఆడుకుంటూ ఉంది.

ఆ చిన్నారి అనుకోకుండా పార్కింగ్ చేసిన కారు ముందు వెల్లి ఆడుకుంటూ కూర్చుంది. అంతలోనే ఒకాయన ఆ చిన్నారి తల్లిని చూసుకోకుండా కారును రయ్యిమంటూ నడిపించడం ప్రారంభించాడు. అది కాస్త ముందుకు వెల్లగానే చక్రాల కింద నలిగి మనస్వి విగతజీవిగా మారింది. కారు డ్రైవర్ నిర్లక్ష్యం ఓవైపు కుటుంబ సభ్యులు చిన్నారిని ఎక్కడుంది గమనించకపోవడంతో ఇంతటి ఘోరం జరిగిపోయింది. ఈ సంఘటన అనంతరం కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజ్‌ ఆధారంగా విచారిస్తున్నారు.

Tags:    

Similar News