చార్మినార్ ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్‌ఖాన్‌తో పాటు.. కుమారుడు ఇంతియాజ్‌పై కేసు నమోదు

Charminar: పోలీసులు తమను వేధిస్తున్నారంటున్న ఇంతియాజ్‌

Update: 2023-11-06 11:21 GMT

చార్మినార్ ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్‌ఖాన్‌తో పాటు.. కుమారుడు ఇంతియాజ్‌పై కేసు నమోదు

Charminar: హైదరాబాద్ చార్మినార్ ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్‌తో పాటు ఆయన కుమారుడు ఇంతియాజ్ పై కేసు నమోదైంది. అనుమతి లేకుండా సెంట్రల్ జోన్ డీసీపీ ఆఫీసు నుండి మోఘల్‌పుర వాటర్ ట్యాంక్‌వరకు 200మందితో వారు ర్యాలీ నిర్వహించారు. దీంతో ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని మొఘల్‌పుర పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేశారు. ఓ కేసులో ఇంతియాజ్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. పోలీసులు తమను అకారణంగా వేధిస్తున్నారంటూ ఇంతియాజ్ ఆరోపిస్తుండగా..పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Tags:    

Similar News