Thummala: ఖమ్మంలో వరదలకు 7వేల ఇళ్లు మునిగాయి
Thummala: ప్రాణనష్టం జరగకుండా అధికారులు అప్రమత్తంగా పనిచేశారు
Thummala: ఖమ్మంలో వరదలు దురదృష్టకరమన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఇప్పుడిప్పుడే పరిస్థితులు చక్కబడుతున్నాయని తెలిపారు. వరద బాధితులకు పదివేల రూపాయల సాయం అందిస్తామని.. బాధితుల అకౌంట్లో డబ్బులు జమ చేస్తామన్నారు. వరదలో సర్టిఫికెట్లు కోల్పోయిన వారికి కూడా అధికారులే తిరిగి సర్టిఫికెట్లు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు మంత్రి తుమ్మల. ఇళ్లు కోల్పోయిన వారికి డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లిస్తామని పేర్కొన్నారు.