Team India Vs Bangladesh: ఐసీసీ టీ20 వరల్డ్‌కప్‌లో ఇవాళ డూ ఆర్ డై మ్యాచ్
*సెమీ ఫైనల్ బెర్త్ కోసం ఇరు జట్ల పోటీ
Team India Vs Bangladesh: టీ20 వరల్డ్ కప్‌లో కీలక పోరు జరగనుంది. బంగ్లాదేశ్‌తో టీమిండియా తలపడనుంది. ఈ మ్యాచ్ గెలిచి సెమీస్‌కు మరింత చేరువ అవ్వాలని భారత్ చూస్తోంది. మరోవైపు బంగ్లాదేశ్‌కు కూడా ఈ మ్యాచ్ ఎంతో కీలకం. టీమిండియా చేతిలో ఓడిపోతే టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. అడిలైడ్ వేదికగా ఈ రెండు జట్లు తలబడబోతున్నాయి. ప్రస్తుతం టీమిండియా 3 మ్యాచ్‌ల్లో 2 విజయాలు, ఒక ఓటమితో 4 పాయింట్లతో గ్రూప్ 2లో రెండో స్థానంలో ఉండగా.. ఆడిన మూడు మ్యాచ్‌ల్లో రెండు విజయాలు, ఒక ఓటమితో బంగ్లాదేశ్ మూడో స్థానంలో ఉంది.
బంగ్లాదేశ్ పై విజయం సాధించి సెమీస్ అవకాశాలను మరింత పదిలం చేసుకోవాలని రోహిత్ సేన వ్యూహాలను సిద్ధం చేసుకుంది. అయితే ఆడి లైడ్ వేదికగా జరగబోయే పోరుకు వర్షం అంతరాయం కలిగించే అవకాశం ఉన్నట్లు అక్కడి వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. టీ20 వరల్డ్ కప్ లో భాగంగా అటు మ్యాచ్‌లన్నీ కూడా హోరాహోరీగా జరుగుతున్న సమయంలో అటు వరుణుడు మాత్రం పగబట్టినట్లుగానే వ్యవహరిస్తున్నాడు అని చెప్పాలి. వరల్డ్ కప్ లో కీలకమైన మ్యాచులు కొన్ని వర్షార్పణం కూడా అయ్యాయి. ఈ క్రమంలోనే దిగ్గజ జట్లు ఊహించని కష్టాలను ఎదుర్కోవాల్సిన పరిస్థితులు కూడా ఏర్పడ్డాయి.
ప్రస్తుతం గ్రూప్ 2 లో రెండవ స్థానంలో కొనసాగుతుంది టీమిండియా. ఇక ఎలాంటి సమీకరణాలు లేకుండా నేరుగా భారత్ సెమిస్ లో అడుగు పెట్టాలంటే మిగతా రెండు మ్యాచ్లలో తప్పక గెలవాల్సి ఉంటుంది. ఒకవేళ దురదృష్టవశాత్తు బంగ్లాదేశ్ మ్యాచ్ రద్దు అయితే మాత్రం ఇరు జట్లకు చెరో పాయింట్ లభిస్తుంది అని చెప్పాలి. ఇక అప్పుడు అయిదు పాయింట్లతో రెండవ స్థానంలో కొనసాగుతుంది టీమిండియా.. అప్పుడు జింబాబ్వే తో జరగబోయే మ్యాచ్ లో తప్పనిసరిగా గెలవాల్సి ఉంటుంది. దీంతో టీమిండియా ఖాతాలో ఏడు పాయింట్లు వస్తాయి.. ఒకవేళ పాకిస్తాన్ వరుసగా రెండు మ్యాచ్లో గెలిచిన ఇంటి ముఖం పట్టక తప్పదు. దీంతో ఈ మ్యాచ్ పై ఉత్కంఠ నెలకొంది.