World Cup 2023: వరల్డ్‌కప్ బృందంలో కేఎల్ రాహుల్.. 15 మంది సభ్యుల పేర్లను ప్రకటించిన చీఫ్ సెలెక్టర్
World Cup 2023: అక్టోబర్ 14న అహ్మదాబాద్ లో ఇండియా పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరగనుంది.
World Cup 2023: అక్టోబర్‌లో జరగనున్న వన్డే ప్రపంచకప్‌కు టీమ్‌ను ప్రకటించింది బీసీసీఐ. 15 మందితో జట్టు ప్రకటించింది బీసీసీఐ. రోహిత్ శర్మకు కెప్టెన్సీ బాధ్యతలు, హార్దిక్ పాండ్యాకు వైస్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది. విరాట్ కోహ్లి, శుభ్‌మాన్ గిల్, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమిలకు టీమ్‌లో చోటు దక్కింది. సంజూ శాంసన్, చాహల్, తిలక్ వర్మకు జట్టులో చోటు దక్కలేదు.
అక్టోబర్ 5 నుంచి భారత్‌లో వన్డే వరల్డ్ కప్ జరగనుంది. 45 రోజుల పాటు లీగ్ జరగనుండగా.. పది వేదికల్లో 48 మ్యాచులు నిర్వహించనున్నారు. లీగ్ స్టేజ్ లో 9 వేదికల్లో మ్యాచులు ఆడనుంది టీమిండియా. ఆస్ట్రేలియాతో తొలి మ్యాచ్ ఆడనుంది భారత జట్టు. అక్టోబర్ 8న చెన్నైలో ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా.... అక్టోబర్ 14న అహ్మదాబాద్ లో ఇండియా పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరగనుంది.