Pink Test: కొనసాగుతున్న బౌలర్ల ఆధిపత్యం - 145 పరుగులకే టీం ఇండియా ఆలౌట్

Pink Test: తొలి ఇన్సింగ్స్ లో టీం ఇండియా 33 పరుగుల ఆధిక్యత సాధించింది.

Update: 2021-02-25 11:10 GMT

రూట్ (ఫోటో ట్విట్టర్)

Pink Test: భారత్‌, ఇంగ్లండ్‌ జట్ల మధ్య నరేంద్ర మోదీ క్రికెట్‌ స్టేడియంలో జరుగుతున్న మూడో టెస్ట్‌ మ్యాచ్‌ ఆసక్తికరంగా మారింది. మొదటి రోజే ఇంగ్లాండ్ టీమ్‌ను టీమిండియా బౌలర్లు 112 పరుగులకే ఆలౌట్‌ చేశారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ కూడా త్వరగానే వికెట్లు కోల్పోవడంతో మ్యాచ్ లో గెలుపు పై ఉత్కంఠ పెరిగింది. ఈ రోజు 99/3 ఓవర్‌నైట్‌ స్కోరుతో టీమిండియా ఆట ప్రారంభించింది. అయితే..భారత్‌ బ్యాట్స్‌మన్‌ ఎంతవరకు ఇంగ్లండ్‌ బౌలర్లను అడ్డుకుంటారోనని ఎదురు చూసిన అభిమానులకు నిరాశే మిగిలింది. రెండో రోజు కూడా బౌలర్ల ఆధిపత్యం కొనసాగింది. దీంతో టీం ఇండియా 145 పరుగులకే ఆలౌట్ అయ్యింది. అయితే ఇండియాకు తొలి ఇన్సింగ్స్ లో 33 పరుగుల ఆధిక్యత సాధించింది.

కాగా, పింక్ బాల్‌ టెస్టులో టీమిండియా ఓపెనర్ రోహిత శర్మ ఒక్కడే ఆఫ్ సెంచరీ పూర్తి చేశాడు. రోహిత్ 66 పరుగులు (96 బంతుల్లో 11 ఫోర్లు) చేసి టాపర్ గా నిలిచాడు. విరాట్ క్లోహీ (27 పరుగులు) నిరాశ పరచగా, అశ్విన్ 17, శుభ్ మన్ గిల్ 11, ఇషాంత్ శర్మ 10 పరుగులు సాధించగా..మిగతా ప్లేయర్స్ అంతా సింగిల్ డిజిట్ కే వెనుదిరిగారు. భారత బౌలర్లకు ధీటుగా ఇంగ్లాండ్ బౌలర్లు కూడా వికెట్ల వేటలో పడ్డారు. దీంతో మొతెరా టెస్టులో విజయం ఎవరిని వరిస్తుందో చూడాలి. కాగా, ఇంగ్లాంగ్ బౌలర్లలో రూట్ 5, లీచ్ 4 వికెట్లతో ఇండియాను కోలుకోకుండా చేశాడు.

Tags:    

Similar News