కోహ్లీతో సగం కూడా శ్రమించడం లేదు సిగ్గుపడతున్న..
భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫిట్‌నెస్ కోసం ప్రాక్టీస్ చూసి తాను సిగ్గుపడ్డానని బంగ్లాదేశ్ డాషింగ్ ఓపెనర్ తమీమ్ ఇక్బాల్ వెల్లడించాడు.
భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫిట్‌నెస్ కోసం ప్రాక్టీస్ చూసి తాను సిగ్గుపడ్డానని బంగ్లాదేశ్ డాషింగ్ ఓపెనర్ తమీమ్ ఇక్బాల్ వెల్లడించాడు. టీమిండియా క్రికెట్లో ఎలాంటి మార్పులు వస్తున్నాయో నిరంతరం పరిశీలిస్తుంటామని వెల్లడించాడు. ప్రభావం ఫిట్‌నెస్‌పై బంగ్లాదేశ్ తమ దృక్పథం మారేందుకు టీమిండియా ప్రభావం ఎంతో ఉందని చెప్పాడు.
భారత్ మా పొరుగు దేశం.. ఫిట్‌నెస్‌పై టీంఇండియా క్రికెటర్ల దృక్పథం బంగ్లాదేశ్‌పై ఎంతో ప్రభావం చూపించింది. కోహ్లీకి వయసు నా వయసులో ఉన్నాడు. అయినా కోహ్లి ఫిట్‌నెస్‌పై ఉన్న దృక్పథం చూసి ఆశ్చర్యపోయానని తమిమ్ వెల్లడించాడు.
ఈ సందర్భంగా బంగ్లా క్రికెటర్ మాట్లాడుతూ ఇది చెప్పేందుకు నేను సిగ్గుపడను. ఈ సంగతి చెప్పాల్సిందే. రెండు మూడేళ్ల క్రితం కోహ్లీ జిమ్‌లో చేసే కసరత్తులు, మైదానంలో పరుగెత్తడం చూసి నాపై నాకే సిగ్గేసింది. నా వయసులో ఉన్న అతడు ఎంతో సాధన చేస్తున్నాడు. అతనిలో సగం కూడా శ్రమించడం లేదు. నేను అంత స్థాయిలో కష్టపడకపోయినా... కనీసం అతడి దారిలోనైనా నడుస్తాను. బహుశా 50-60 శాతమైనా చేరుకోవచ్చు' అని తమీమ్ అన్నాడు.
తమీమ్ ఇక్బాల్ బంగ్లాదేశ్ జట్టు తరపున 207 వన్డేలకు ప్రాతినిధ్యం వహించాడు. 13 శతకాలు , 47 హాఫ్ సెంచరీలు 7202 పరుగులు సాధించాడు. బంగ్లాదేశ్ జట్టులో అత్యంత సీనియర్ ప్లేయర్. అయితే గత సంవత్సరం బంగ్లాదేశ్ భారత్ లో పర్యటీంచినప్పుడు వ్యక్తిగత కారణాలతో ఆ పర్యాటనకు దూరంగా ఉన్నాడు.
HMTV లైవ్ వార్తలు ఎప్పటికప్పుడు గూగుల్ న్యూస్ లో చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి