Vaibhav Suryavanshi: ఐపీఎల్‌లో ఆడేందుకు వైభవ్‌ సూర్యవంశీ అర్హుడేనా?.. క్రికెట్‌ నిబంధనలు ఇలా!

Vaibhav Suryavanshi: వైభవ్‌ సూర్యవంశీని రాజస్థాన్‌ రాయల్స్‌ మంచి ధరకే తీసుకున్నా.. ప్రస్తుతం క్రికెట్ అభిమానులను ఓ ప్రశ్న వేధిస్తోంది. 13 ఏళ్ల వైభవ్ ఐపీఎల్‌ 2025లో ఆడేందుకు అర్హుడా? అని ఫాన్స్ చర్చిస్తున్నారు.

Update: 2024-11-26 15:47 GMT

Vaibhav Suryavanshi: సౌదీ అరేబియాలోని జెడ్డాలో రెండు రోజుల పాటు సాగిన ఐపీఎల్‌ 2025 మెగా వేలం ముగిసింది. ఈ వేలంలో 182 మంది క్రికెటర్లను పది ఫ్రాంఛైజీలు కొనుగోలు చేశాయి. ఇందులో 120 మంది స్వదేశీ ఆటగాళ్లు ఉండగా.. 62 మంది ఫారిన్‌ ప్లేయర్స్ ఉన్నారు. 10 ప్రాంఛైజీలు 182 మంది కోసం ఏకంగా రూ.639.15 కోట్లు ఖర్చు చేశాయి. 27 కోట్లతో అత్యధిక ధర పలికిన ఆటగాడిగా రిషబ్ పంత్ చరిత్ర సృష్టించగా.. వేలంలో అమ్ముడుపోయిన అతిపిన్న వయస్సు ఆటగాడిగా 13 ఏళ్ల వైభవ్‌ సూర్యవంశీ రికార్డు సృష్టించాడు. రూ.1.10 కోట్ల ధరకు రాజస్థాన్‌ రాయల్స్‌ అతడిని దక్కించుకుంది.

వైభవ్‌ సూర్యవంశీని రాజస్థాన్‌ రాయల్స్‌ మంచి ధరకే తీసుకున్నా.. ప్రస్తుతం క్రికెట్ అభిమానులను ఓ ప్రశ్న వేధిస్తోంది. 13 ఏళ్ల వైభవ్ ఐపీఎల్‌ 2025లో ఆడేందుకు అర్హుడా? అని ఫాన్స్ చర్చిస్తున్నారు. నిజానికీ ఐపీఎల్ టోర్నీలో ఆడేందుకు వయసు నిబంధన లేదు. ప్లేయర్స్ సంసిద్ధతపై నిర్ణయాలను బీసీసీఐ ఫ్రాంచైజీలకు వదిలేసింది. ప్రస్తుతం 13 నెలల 8 నెలల వయసు ఉన్న వైభవ్‌కు.. ఐపీఎల్ 2025 ఆరంభ సమయానికి 14 ఏళ్లు పూర్తవుతాయి. అయినా వచ్చే సీజన్‌లో రాజస్థాన్ అతడిని ఆడించే అవకాశాలు దాదాపు లేవు. ఆడే అవకాశాలు లేకున్నా.. రాజస్థాన్‌ ఆటగాళ్లతో కలిసి డ్రెసింగ్ రూమ్ పంచుకుంటాడు. అంతేకాదు కోచింగ్‌ బృందంలోని రాహుల్ ద్రవిడ్, కుమార సంగక్కర వంటి దిగ్గజ ఆటగాళ్లతో కూడా డ్రెస్సింగ్‌ రూమ్‌పంచుకోవడం అతడి కెరీర్‌కు ఉపయోగపడుతుంది.

ఐపీఎల్‌లో వయసు నిబంధన లేకున్నా.. అంతర్జాతీయ క్రికెట్‌లో మాత్రం ఉంది. అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడే ఆటగాళ్లకు కనీస వయసు 15 ఏళ్లు. 2020లో ఈ నిబంధనను ఐసీసీ అమల్లోకి తెచ్చింది. అయితే కొన్ని సందర్భాల్లో 15 ఏళ్లలోపు ఆటగాళ్లను ఆడించాలంటే ఐసీసీ నుంచి క్రికెట్ బోర్డులు ప్రత్యేక అనుమతిని అభ్యర్థించవచ్చు. 1996లో పాక్ తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన హసన్ రజా వయసు 14 సంవత్సరాల 227 రోజులు. రజా అప్పుడు టెస్టుల్లోకి అరంగేట్రం చేశాడు. అప్పట్లో వయసు నిబంధనలు లేవు.

రాజస్థాన్‌ రాయల్స్‌ టీమ్ ఇదే:

సంజూ శాంసన్‌ (18 కోట్లు)

యశస్వి జైస్వాల్‌ (18 కోట్లు)

రియాన్‌ పరాగ్‌ (14 కోట్లు)

ధృవ్‌ జురెల్‌ (14 కోట్లు)

షిమ్రోన్‌ హెట్‌మైర్‌ (11 కోట్లు)

సందీప్‌ శర్మ (4 కోట్లు)

జోఫ్రా ఆర్చర్‌ (12.50 కోట్లు)

తుషార్‌ దేశ్‌పాండే (6.5 కోట్లు)

వనిందు హసరంగ (5.25 ‍కోట్లు)

నితీశ్‌ రాణా (4.2 కోట్లు)

ఫజల్‌ హక్‌ ఫారూకీ (2 కోట్లు)

మహీశ్‌ తీక్షణ (4.40 కోట్లు)

క్వేనా మపాకా (1.5 కోట్లు)

ఆకాశ్‌ మధ్వాల్‌ (1.20 కోట్లు)

శుభమ్‌ దూబే (80 లక్షలు)

యుద్ద్‌వీర్‌ చరక్‌ (35 లక్షలు)

ఆశోక్‌ శర్మ (30 లక్షలు)

కునాల్‌ రాథోడ్‌ (30 లక్షలు)

కుమార్‌ కార్తీకేయ (30 లక్షలు)

వైభవ్‌ సూర్యవంశీ (1.1 కోట్లు)

Tags:    

Similar News