IND vs AUS: మీరు మసాలా జోడించడానికి ముందుంటారు.. ఆస్ట్రేలియా ప్రధాని, కోహ్లీ ఆసక్తికర చర్చ..!

IND vs AUS: భారత జట్టు ప్రస్తుతం ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే.

Update: 2024-11-28 12:48 GMT

IND vs AUS: మీరు మసాలా జోడించడానికి ముందుంటారు.. ఆస్ట్రేలియా ప్రధాని, కోహ్లీ ఆసక్తికర చర్చ..!

IND vs AUS: భారత జట్టు ప్రస్తుతం ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024లో భాగంగా పెర్త్‌ వేదికగా జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఘన విజయం విజయం సాధించింది. ఇక డిసెంబర్ 6 నుంచి అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియా, భారత్ జట్ల మధ్య రెండో టెస్ట్ ఆరంభం కానుంది. అంతకుముందే డిసెంబర్ 30 నుంచి ప్రైమ్‌మినిస్టర్స్‌ XIతో రెండు రోజుల వార్మప్‌ మ్యాచ్‌ను భారత్ ఆడనుంది. ఈ మ్యాచ్ కోసం రోహిత్ సేన సిద్ధమవుతోంది.

కాన్‌బెర్రాలో ప్రైమ్‌మినిస్టర్స్‌ XI, భారత్ మ్యాచ్ జరగనుంది. ఇందుకోసం టీమిండియా అక్కడికి చేరుకుంది. ఈ క్రమంలో కాన్‌బెర్రాలోని పార్లమెంట్‌ హౌస్‌లో ఆసీస్ ప్రధాని ఆంథోని ఆల్బనీస్‌తో భారత క్రికెటర్లు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా టీమిండియా క్రికెటర్లతో ఫొటోలు దిగుతూ ప్రధాని ఆల్బనీస్‌ సందడి చేశారు. ఈ క్రమంలో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, ఆసీస్ ప్రధాని మధ్య ఆసక్తికర చర్చ జరిగింది. తొలి టెస్టులో విరాట్ సెంచరీ చేసిన విషయాన్ని ప్రస్తావిస్తూ.. 'పెర్త్‌లో అద్భుతం జరిగింది. అప్పుడు మా ప్లేయర్స్ పెద్దగా బాధపడినట్లు లేదు' అని ఆల్బనీస్‌ అన్నారు. 'మీరు మసాలా జోడించడానికి ఎప్పుడూ ముందే ఉంటారు' అని విరాట్ నవ్వుతూ సమాధానం ఇచ్చాడు. దాంతో అక్కడ నవ్వులు విరబూశాయి. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

టీమిండియా క్రికెటర్లతో దిగిన ఫొటోలను ఆసీస్ ప్రధాని ఆంథోని ఆల్బనీస్‌ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 'భారత జట్టుతో ఆడటం ప్రైమ్‌మినిస్టర్స్‌ XIకు పెద్ద సవాలే. అయితే ప్రధాని మోడీకి చెప్పినట్లుగా.. మా ప్లేయర్స్ అద్భుతంగా ఆడేందుకు నేను అండగా ఉంటా' అని పేర్కొన్నారు. పెర్త్ టెస్టులో రాణించడమే కాదు.. సారథిగా ఆకట్టుకున్న జస్ప్రీత్ బుమ్రాను ఆల్బనీస్‌ ప్రత్యేకంగా అభినందించారు. ఆసీస్ ప్రధానితో కలిసి టీమిండియా ప్లేయర్స్ అల్పాహారం తిన్నారు.

తొలి టెస్టుకు దూరమైన కెప్టెన్ రోహిత్ శర్మ రెండు రోజుల క్రితమే భారత జట్టుతో కలిశాడు. రెండో టెస్టులో అతడు ఎవరి స్థానంలో వస్తాడనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. హిట్‌మ్యాన్ స్థానంలో ఓపెనర్‌గా వచ్చిన కేఎల్ రాహుల్ రాణించాడు. దేవదత్‌ పడిక్కల్‌ ఫర్వాలేదనిపించినా.. సీనియర్ రాహుల్‌ను పక్కన పెట్టే సాహసం భారత్ చేయదు. పడిక్కల్‌ పైనే వేటు పడనుంది. రోహిత్‌ ఓపెనర్‌గా ఆడితే.. రాహుల్ వన్‌డౌన్‌లో ఆడతాడు. గత రెండు పర్యాయాలు ఆస్ట్రేలియాలో సిరీస్ నెగ్గిన భారత్.. ఈసారి కూడా కైవసం చేసుకోవాలని చూస్తోంది. ఇది టెస్ట్ సిరీస్‌లో టీమిండియా 1-0తో ఆధిక్యంలో ఉంది.


Tags:    

Similar News