KKR Captain 2025: కోల్‌కతా కెప్టెన్‌గా టీమిండియా సీనియర్ ప్లేయర్.. రూ.1.75 కోట్లకే పట్టేసిందిగా!
Kolkata Knight Riders Captain 2025: కోల్‌కతా కెప్టెన్సీ అంశంపై కేకేఆర్ సీఈవో వెంకీ మైసూర్ స్పందించారు.
KKR Captain: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 మెగా వేలం ముగిసింది. 10 ఫ్రాంఛైజీలు కలిపి 182 మంది ఆటగాళ్లను కొనుగోలు చేశాయి. ఇందుకోసం రూ.639.15 కోట్లు ఖర్చు చేశాయి. ప్రణాళికలప్రకారం.. ప్రాంఛైజీలు తమకు కావాల్సిన ఆటగాళ్లను వేలంలో ఎంపిక చేసుకున్నాయి. కొన్ని ప్రాంఛైజీలు కెప్టెన్ కోసం కోట్లు కుమ్మరించాయి. రిషబ్ పంత్ (27 కోట్లు) కోసం లక్నో, శ్రేయస్ అయ్యర్ (26.75 కోట్లు) కోసం పంజాబ్, కేఎల్ రాహుల్ (14 కోట్లు) కోసం ఢిల్లీలు భారీగా ఖర్చు చేశాయి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్‌కతా నైట్ రైడర్స్ మినహా దాదాపు అన్ని జట్లకు కెప్టెన్లు ఉన్నట్లే. బెంగళూరుకు విరాట్ కోహ్లీ ఉన్నాడు. కోల్‌కతాకు మాత్రం ఎవరూ లేరు. ఉన్న వాళ్లలో ఎవరికి అవకాశం ఉందో చూద్దాం.
ఐపీఎల్ 2024లో కేకేఆర్‌ను ఛాంపియన్‌గా నిలిపిన శ్రేయస్ అయ్యర్‌ను.. ఐపీఎల్ 2025 వేలంలో పంజాబ్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం కేకేఆర్‌లో 21 మంది ప్లేయర్స్ ఉన్నారు. ఆరుగురిని రిటైన్ చేసుకోగా.. 15 మందిని కొనుగోలు చేసింది. 21 మందిలో ఆండ్రీ రసెల్, సునీల్ నరైన్ సీనియర్లు. అయితే వీరిని కెప్టెన్ చేసే అవకాశాలు లేవు. కొన్నాళ్లుగా జట్టులో ఉన్న వెంకటేశ్ అయ్యర్‌కు కెప్టెన్సీ అనుభవం లేదు. అందుకే చివరి నిమిషంలో టీమిండియా సీనియర్ ప్లేయర్ అజింక్య రహానేను కోల్‌కతా కొనుగోలు చేసినట్లు సమాచారం. మొదట అన్‌సోల్డ్ అయిన రహానేను రెండో రోజు వేలంలో అతడి కనీస ధర రూ.1.75 కోట్లకు కొనుగోలు చేసింది. 2022లో కోల్‌కతా తరఫున ఏడు మ్యాచ్‌లు ఆడిన రహానేకు.. కాస్త కెప్టెన్సీ అనుభవం ఉంది. భారత జట్టుకు టెస్టుల్లో జింక్స్ కెప్టెన్‌గా వ్యవహరించాడు.
కోల్‌కతా కెప్టెన్సీ అంశంపై కేకేఆర్ సీఈవో వెంకీ మైసూర్ స్పందించారు. అజింక్య రహానేను కెప్టెన్ చేయాలా? వద్దా? అనేది తమ నిర్ణయం కాదని, ఫ్రాంఛైజీలో భాగస్వాములు తుది నిర్ణయం తీసుకుంటారని వెంకీ తెలిపారు. ఐపీఎల్ 2025 వేలంలో తమ ప్రణాళికలను అమలు చేశామని, జట్టు పటిష్టంగా ఉందన్నారు. అన్ని విభాగాల్లో మంచి ఆటగాళ్లను తీసుకున్నందుకు చాలా సంతోషంగా ఉందని ఆయన చెప్పుకొచ్చారు.
కేకేఆర్ ఫుల్ టీమ్ ఇదే:
రింకు సింగ్, వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్, ఆండ్రీ రసెల్, అన్రిచ్ నోర్జ్, హర్షిత్ రాణా, రమణ్‌దీప్ సింగ్, వెంకటేశ్ అయ్యర్, క్వింటన్ డికాక్, స్పెన్సర్ జాన్సన్, రెహ్మనుల్లా గుర్బాజ్, రఘువంశీ, మొయిన్ అలీ, వైభవ్ అరోరా, రొవ్‌మన్ పావెల్, మనీశ్ పాండే, అనుకుల్ రాయ్, మయాంక్ మార్కండే, ఉమ్రాన్ మలిక్, లవ్‌నిత్ సిసోడియా, అజింక్య రహానే.