KL Rahul: వేచి ఉండలేకపోతున్నా.. కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్!

KL Rahul: టెస్ట్ సిరీస్ కోసం కేల్ రాహుల్ ఆస్ట్రేలియాలో ఉన్న విషయం తెలిసిందే. రాహుల్ మాట్లాడిన వీడియోను ఢిల్లీ క్యాపిటల్స్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

Update: 2024-11-27 15:30 GMT

KL Rahul: వేచి ఉండలేకపోతున్నా.. కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్!

KL Rahul: నవంబర్ 24, 25 తేదీలలో సౌదీ అరేబియాలోని జెడ్డాలో ఐపీఎల్ 2025 మెగా వేలం ముగిసిన విషయం తెలిసిందే. 182 మంది ఆటగాళ్లను 10 ప్రాంఛైజీలు కొనుగోలు చేశాయి. వేలంలో కొందరు ఆటగాళ్లకు అనూహ్య ధర పలకగా.. కొందరికి ఊహించిన దాని కంటే తక్కువే దక్కింది. టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ కనీసం రూ. 20 కోట్లయినా పలుకుతాడనుకుంటే.. ఢిల్లీ క్యాపిటల్స్ అతడిని రూ. 14 కోట్లకే సొంతం చేసుకుంది. వేలం అనంతరం రాహుల్‌ తొలిసారి స్పందించాడు. ఢిల్లీ జట్టులో చేరడం సంతోషంగా ఉందని, సీజన్ ప్రారంభమయ్యే వరకు వేచి ఉండలేకపోతున్నా అని తెలిపాడు.

టెస్ట్ సిరీస్ కోసం కేల్ రాహుల్ ఆస్ట్రేలియాలో ఉన్న విషయం తెలిసిందే. రాహుల్ మాట్లాడిన వీడియోను ఢిల్లీ క్యాపిటల్స్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. వీడియోలో రాహుల్ మాట్లాడుతూ... 'నేను ఢిల్లీ క్యాపిటల్స్‌ ప్రాంచైజీలో చేరడం చాలా సంతోషంగా ఉంది. డీసీతో నా కొత్త ప్రయాణం మొదలవుతుంది. ఢిల్లీ టీమ్ చాలా బాగుంది. ఐపీఎల్ 2025 సీజన్ ఆరంభమయ్యే వరకు వేచి ఉండలేకపోతున్నా. ఢిల్లీకి వచ్చి అరుణ్‌ జైట్లీ స్టేడియంలో ఆడి మిమ్మల్ని అలరిస్తాను. ఇక అక్కడ కలుద్దాం. అందరిని ధన్యవాదాలు' అని చెప్పాడు. గతంలో లక్నో సూపర్ జెయింట్స్ సారథిగా ఉన్న రాహుల్ వేలంలోకి వచ్చిన విషయం తెలిసిందే.



ఐపీఎల్ 2024లో సన్‌రైజర్స్ హైదరాబాద్ మ్యాచులో లక్నో 10 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఈ ఘోర పరాజయం తర్వాత లోకేష్ రాహుల్‌ను లక్నో ఓనర్ సంజీవ్ గోయంకా బహిరంగంగా తిట్టాడు. ఈ దృశ్యాలు కెమెరాకు చిక్కగా.. సోషల్ మీడియాలో వైరల్ అయింది. అప్పుడే లక్నోను వీడాలని రాహుల్ నిర్ణయించుకున్నాడట. కొద్దిరోజుల క్రితం రాహుల్, గోయంకాలు భేటీ అవ్వడంతో.. సమస్యలు సమసిపోతాయని అందరూ అనుకున్నారు. రాహుల్‌ను లక్నో వేలంలోకి వదిలేసింది. మరలా తీసుకుంటుందనుకున్నా.. అది జరగలేదు. రిషబ్ పంత్‌ను ఏకంగా రూ.27 కోట్లకు కొనుగోలు చేసింది.

ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు:

అక్షర్‌ పటేల్‌, కుల్‌దీప్‌ యాదవ్, స్టబ్స్‌, అభిషేక్‌ పోరెల్, కేఎల్ రాహుల్, మిచెల్‌ స్టార్క్‌, టి. నటరాజన్‌, జేక్‌ ఫ్రెసర్‌ మెక్‌గర్క్‌, ముకేశ్‌ కుమార్‌, హ్యారీ బ్రూక్‌, అశుతోష్‌ శర్మ, మోహిత్‌ శర్మ, ఫాఫ్‌ డుప్లెసిస్‌, సమీర్‌ రజ్వీ, డోనోవన్‌ ఫెరెరా, దుశ్మంత చమీరా, విప్రజ్‌ నిగమ్‌, కరుణ్‌ నాయర్‌, మాధవ్‌ తివారి, త్రిపురాన విజయ్‌, మన్వంత్‌ కుమార్‌, అజయ్‌ మండల్‌, దర్శన్‌ నల్కండే.

Tags:    

Similar News