Shubman Gill: రెండో టెస్టుకూ గిల్ దూరం.. రోహిత్ శర్మ ఎవరి స్థానంలో ఆడుతాడు!
Shubman Gill: టీమిండియా ఓపెనర్ శుభ్‌మన్ గిల్ వేలికి గాయమైన సంగతి తెలిసిందే. బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీ 2024 ఆరంభానికి ముందు ఇంట్రాస్క్వాడ్ వార్మప్ మ్యాచ్‌లో గిల్ గాయపడ్డాడు.
Shubman Gill: టీమిండియా ఓపెనర్ శుభ్‌మన్ గిల్ వేలికి గాయమైన సంగతి తెలిసిందే. బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీ 2024 ఆరంభానికి ముందు ఇంట్రాస్క్వాడ్ వార్మప్ మ్యాచ్‌లో గిల్ గాయపడ్డాడు. గాయం కారణంగా అతడు టెస్టులో ఆడలేదు. తాజాగా గిల్ గాయంపై కీలక అప్‌డేట్ ఒకటి తెలిసింది. అతడి వేలికి అయిన గాయం ఇంకా తగ్గలేదని తెలుస్తోంది. దీంతో ప్రైమ్‌మినిస్టర్స్ ఎలెవన్ జట్టుతో రెండు రోజుల వార్మప్ మ్యాచ్‌లో గిల్ ఆడడం కష్టమే. అంతేకాదు అడిలైడ్ వేదికగా జరిగే పింక్‌బాల్ టెస్టుకు దూరమయ్యే అవకాశాలు ఉన్నాయని క్రికెట్ వర్గాలు పేర్కొన్నాయి.
శుభ్‌మన్ గిల్‌కు కనీసం 2 నుంచి 3 వారాల పాటు విశ్రాంతి అవసరమని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. 'గిల్‌కు కనీసం 14 రోజుల విశ్రాంతి అవసరమని వైద్య బృందం చెప్పింది. ప్రైమ్‌మినిస్టర్స్ ఎలెవన్ జట్టుతో జరిగే వార్మప్ మ్యాచ్‌లో ఆడడు. అడిలైడ్‌లో రెండో టెస్టు డిసెంబర్ 6న ఆరంభం అవుతుంది. అప్పటికి గాయం పరిస్థితిని పరిశీలించి నిర్ణయం తీసుకుంటారు. పూర్తిగా కోలుకోకపోతే మాత్రం గిల్ రెండో టెస్టుకు దూరం అవుతాడు. గిల్ గాయం నుంచి ఎంత త్వరగా కోలుకుంటాడనేది ఇక్కడ కీలకం. గాయం తగ్గితే రెండో టెస్టుకు ముందు ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొంటాడురెండో టెస్టుకు ముందు తుది జట్టుపై నిర్ణయం తీసుకుంటారు' అని బీసీసీఐ వర్గాలు చెప్పాయి. రెండో టెస్టుకు ఇంకా పది రోజుల సమయం ఉంది.
తొలి టెస్టుకు దూరమైన కెప్టెన్ రోహిత్ శర్మ భారత జట్టుతో కలిశాడు. పెర్త్ టెస్టులో విజయం సాధించిన ఆటగాళ్లకు విషెష్ తెలిపాడు. అయితే రెండో టెస్టులో అతడు ఎవరి స్థానంలో వస్తాడనేది ఆసక్తికరంగా మారింది. హిట్‌మ్యాన్ స్థానంలో ఓపెనర్‌గా వచ్చిన కేఎల్ రాహుల్ అద్భుత ప్రదర్శన చేశాడు. రెండు ఇన్నింగ్స్‌లతో ఆకట్టుకున్నాడు. మొదటి ఇన్నింగ్స్‌లో విఫలమైన దేవదత్ పడిక్కల్.. రెండో ఇన్నింగ్స్‌లో ఫర్వాలేదనిపించాడు. సీనియర్ రాహుల్‌ను పక్కన పెట్టే అవకాశాలు లేవు కాబట్టి.. పడిక్కల్ పైనే వేటు పడనుంది. రోహిత్ ఓపెనర్‌గా వస్తాడా? లేదా రాహుల్‌ను కొనసాగిస్తారా? అన్నది చూడాలి. ఒకవేళ రోహిత్ ఇన్నింగ్స్‌ను ప్రారంభిస్తే.. వన్‌డౌన్‌లో రాహుల్ వచ్చే అవకాశాలు ఉంటాయి. విరాట్ కోహ్లీ, రిషభ్ పంత్, ధ్రువ్ జురెల్, నితీశ్ కుమార్ రెడ్డిలు 4, 5, 6, 7 స్థానాల్లో బ్యాటింగ్‌కు వస్తారు. బౌలింగ్‌లో మార్పులు ఉండకపోవచ్చు. పడిక్కల్ మినహా మిగతా ప్లేయర్స్ రెండో టెస్టులో కొనసాగనున్నారు.