India Vs South Africa: సౌతాఫ్రికా 199 పరుగులకు ఆలౌట్
India Vs South Africa: 146 పరుగుల ఆధిక్యంలో ఇండియా
India Vs South Africa: భారత్ సౌతాఫ్రికా మధ్య మూడోరోజు ఆట ముగిసింది. భారత్ రెండో ఇన్నింగ్స్‌లో ఒక వికెట్ నష్టానికి 16 పరుగులు చేసింది. ఓపెనర్ మయాంక్ అగర్వాల్ 4 పరుగులకే ఔటయ్యాడు. తొలి ఇన్నింగ్స్‌లో 130 పరుగులతో కలిసి భారత్ 146 పరుగుల లీడ్‌లో ఉంది. అంతకుముందు 276 పరుగులతో మూడో రోజు బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ 327 పరుగులకే ఆలౌట్ అయింది. దక్షిణాఫ్రికా పేసర్ లుంగి ఎంగిడి భారత్‌ని కుప్పకూల్చాడు. వరుసగా వికెట్లు తీస్తు కోలుకోలేని దెబ్బతీశాడు.
రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన సౌతాఫ్రికాను భారత బౌలర్లు ఓ ఆటాడుకున్నారు. ఎక్కడా ఎవ్వరిని క్రీజులో నిలదొక్కుకోనివ్వలేదు. వరుసగా వికెట్లు సాధిస్తూ కోలుకోలేని దెబ్బ తీశారు. టెంబా బవుమా ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. హాఫ్ సెంచరీ సాధించి కనీసం 150 పరుగులు దాటేలా చేశాడు. క్వింటన్ డికాక్ 34 పరుగులు పర్వాలేదనిపించాడు. మిగతా వారెవ్వరు పెద్దగా రాణించలేదు. దీంతో సౌతాఫ్రికా 199 పరుగులకు ఆలౌట్ అయింది.