Sanju Samson: ధోనీ, కోహ్లీ, రోహిత్ శర్మ నా కొడుకు జీవితాన్ని 10 ఏళ్లు వృధా చేశారు: సంజూ శాంసన్ తండ్రి షాకింగ్ కామెంట్స్
Sanju Samson: భారత క్రికెట్ జట్టు ప్రస్తుతం దక్షిణాఫ్రికా పర్యటనలో 4 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో పాల్గొంటోంది.
Sanju Samson: భారత క్రికెట్ జట్టు ప్రస్తుతం దక్షిణాఫ్రికా పర్యటనలో 4 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో పాల్గొంటోంది. టూర్‌లోని తొలి మ్యాచ్‌లోనే సంజూ శాంసన్ బ్లాస్టింగ్ సెంచరీతో వార్తల్లో నిలిచారు. నవంబర్ 8న దక్షిణాఫ్రికాతో జరిగిన మొదటి టీ20లో భారత వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ సంజు శాంసన్ 50 బంతుల్లో 107 పరుగులతో అద్భుతమైన సెంచరీని సాధించాడు. కానీ, దీని తర్వాత ఆ తర్వాతి రెండు మ్యాచ్‌ల్లో ఖాతా కూడా తెరవలేక సున్నాకే ఔటయి పెవిలియన్‌కు చేరుకున్నాడు.
సంజూ శాంసన్ తండ్రి పెద్ద ఆరోపణలు
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న ఈ సిరీస్‌లో సంజూ శాంసన్ తండ్రి శాంసన్ విశ్వనాథ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో సంచలన వ్యాఖ్యలు చేశారు. గత దశాబ్దంలో ముగ్గురు మాజీ భారత క్రికెట్ కెప్టెన్లు, ఒక కోచ్ తన కుమారుడి కెరీర్‌ను డ్యామేజ్ చేశారని సంచలన ఆరోపణలు చేశారు. మలయాళ వార్తా ఛానెల్ మీడియా వన్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో.. సంజు శాంసన్ తండ్రి విశ్వనాథ్ మలయాళంలో మాట్లాడుతూ.. 3 భారత కెప్టెన్లు ఎంఎస్ ధోని, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అలాగే మాజీ ప్రధాన కోచ్ రాహుల్ ద్రావిడ్ నా కొడుకు సంజూ పది సంవత్సరాల కెరీర్ ను నాశనం చేశారని ఆరోపించారు. శాంసన్ తండ్రికి సంబంధించిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
గంభీర్, సూర్యకు ధన్యవాదాలు
తన కుమారుడి ప్రతిభను కాదనలేనని, అయితే తన కుమారుడికి మాత్రం అవకాశాలు రావడం లేదని విశ్వనాథ్ అన్నారు. అతను మాజీ క్రికెటర్లు గౌతమ్ గంభీర్, సూర్యకుమార్ యాదవ్‌లకు కృతజ్ఞతలు తెలిపాడు. ముఖ్యమైన సందర్భాలలో తనకు మద్దతుగా నిలిచినందుకు వారికి ఘనత ఇచ్చాడు. సంజూ శాంసన్ చేసిన రెండు సెంచరీలను గంభీర్, యాదవ్‌లకు అంకితం చేసిన విశ్వనాథ్, వారిని ప్రోత్సహించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. అంతటితో ఆగని సంజూ శాంసన్ తండ్రి విశ్వనాథ్.. భారత మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ తన కుమారుడితో అనుచితంగా ప్రవర్తించాడని, వ్యక్తిగత ద్వేషంతోనే శ్రీకాంత్ చర్యలు ఉన్నాయన్నారు. బంగ్లాదేశ్‌పై సెంచరీ చేసిన తర్వాత శ్రీకాంత్.. సంజూ శాంసన్‌ను ఎగతాళి చేశారన్నారు.