Sachin Tendulkar: పాక్ చేతిలో టీమిండియా ఓటమికి కారణాలు ఇవే
* పాకిస్తాన్ చేతిలో భారత్ ఓడిపోవడానికి గల కారణాలను చెప్పిన సచిన్ టెండూల్కర్
Sachin Tendulkar: భారత్ - పాక్ మధ్య జరిగిన మ్యాచ్ లో టీమిండియా ఓటమికి గల కారణాలు మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ చెప్పుకొచ్చాడు. అక్టోబర్ 24న దుబాయ్ అంతర్జాతీయ స్టేడియంలో భారత్ - పాక్ మధ్య జరిగిన మ్యాచ్ లో పిచ్ బ్యాటింగ్ కి అనుకూలించినా భారత బ్యాట్స్ మెన్ లు మాత్రం అనుకున్నదాని కంటే 20-25 పరుగులు తక్కువే చేసిందన్నాడు.
పాక్ బౌలర్ అఫ్రిది వేసిన బంతులను రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ ఎదుర్కోవడంలో ఇబ్బందిపడ్డారని., ఆ ఇద్దరి ఆటగాళ్ళ ఫుట్ వర్క్ సరిగ్గా లేనందునే ఔటై పెవిలియన్ చేరారని చెప్పుకొచ్చాడు. ఇక పాక్ బౌలర్స్ మాత్రమే కాకుండా ఓపెనర్లు రిజ్వనా, బాబర్ ఆజమ్ తమ బ్యాటింగ్ తో పాక్ విజయంలో కీలక పాత్ర పోషించారని సచిన్ టెండూల్కర్ తెలిపాడు.
భారత జట్టు తరహాలోనే పాక్ ఆదిలోనే రెండు, మూడు వికెట్లు పడితే ఒత్తిడిలోకి వెళ్లేదని తెలిపాడు. ముఖ్యంగా పాకిస్తాన్ జట్టుతో రెండేళ్లుగా ఎలాంటి మ్యాచ్ లు ఆడకపోవడంతో భారత జట్టు వారి ఆటను అర్ధం చేసుకోలేకపోయారన్నాడు. ఇక రానున్న మ్యాచ్ లలో భారత క్రికెట్ జట్టు తప్పకుండా పుంజుకుంటుందని సచిన్ టెండూల్కర్ ఆశాభావం వ్యక్తం చేశాడు.