IPL 2023: హైదరాబాద్ సన్ రైజర్స్ కథ కంచికేనా.. కొంపముంచిన టెయిల్ ఎండర్స్..!

IPL 2023: ఐపీఎల్ 2023లో హైదరాబాద్ సన్ రైజర్స్ ను దురదృష్టం వెంటాడుతోంది

Update: 2023-05-05 06:37 GMT

IPL 2023: హైదరాబాద్ సన్ రైజర్స్ కథ కంచికేనా.. కొంపముంచిన టెయిల్ ఎండర్స్..

IPL 2023: ఐపీఎల్ 2023లో హైదరాబాద్ సన్ రైజర్స్ ను దురదృష్టం వెంటాడుతోంది. ప్లే ఆఫ్స్ అవకాశాలను సజీవంగా నిలుపుకోవాలంటే కోల్ కత్ నైట్ రైడర్స్ పై గెలవాలి. ఉప్పల్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో నైట్ రైడర్స్ పై సన్ రైజర్స్ టీమ్ గెలుపు ఖాయమని అంతా అనుకున్నారు. కానీ, ఆఖరి ఓవర్ లో 9 పరుగులు చేయలేక చేతులెత్తేసింది. గెలవాల్సిన మ్యాచ్ ను చేజార్చుకొని ఈ సీజన్ లో 6వ ఓటమిని తన ఖాతాలో వేసుకున్న సన్ రైజర్స్..ప్లే ఆఫ్ అవకాశాన్ని క్లిష్టతరం చేసుకుంది.

తొలుత బ్యాటింగ్ చేసిన కోల్ కతా నైట్ రైడర్స్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 171 పరుగులు సాధించింది. అనంతరం బ్యాటింగ్ కి దిగిన సైన్ రైజర్స్ మొదట్లో కాస్త తడబడ్డా అనంతరం తేరుకుంది. విజయలక్ష్యాన్ని అందుకునే క్రమంలో దూసుకెళ్లింది. ఒక దశలో 36 బంతుల్లో 48 పరుగులు అవసరం అయ్యాయి. దీంతో సన్ రైజర్స్ విజయం తేలికే అనిపించింది. ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టే లక్ష్యానికి చేరువగా నిలిచింది. చివరి ఓవర్ లో 9 పరుగులు కావాలి. క్రీజులో సమద్ ఉండడంతో గెలుపు లాంఛనమే అనుకున్నారు అంతా. కానీ సమద్ మూడో బంతికి ఔట్ కావడం, మిగిలిన 3 బంతుల్లో 7పరుగులు కావాల్సి ఉండగా కేవలం ఒక్క పరుగే రావడంతో సన్ రైజర్స్ 5 పరుగుల తేడాతో కోల్ కతా నైట్ రైడర్స్ చేతిలో పరాభవాన్ని ఎదుర్కొంది. మొత్తంగా, కేకేఆర్ కెప్టెన్ నితీశ్ రాణా..తన బౌలర్ వరుణ్ చక్రవర్తిని డెత్ బౌలర్ గా వాడుకోవడం ఆ టీమ్ కు విజయాన్ని అందించింది.

Tags:    

Similar News