Vinesh Phogat: పారిస్ ఒలింపిక్స్‌లో వినేశ్ ఫోగాట్‌లాగే అనర్హత వేటుకు గురైన మరో ఐదుగురు..!
Vinesh Phogat: ఒలింపిక్స్‌లో అనర్హత వేటు పడటం ఇదేమి మొదటిసారి కాదు. ఈ జాబితాలో మరో ఐదుగురు ఉన్నారు.
Vinesh Phogat: భారత రెజ్లర్ వినేశ్ ఫోగాట్ పారిస్ ఒలింపిక్స్ నుంచి నిష్క్రమించారు. వినేశ్ 100 గ్రాముల అధిక బరువుతో అనర్హురాలిగా ప్రకటించారు. వినేశ్ ఫ్రీస్టైల్ రెజ్లింగ్‌లో ఫైనల్ మ్యాచ్ ఆడేందుకు సిద్ధమైంది. దేశం మొత్తం ఆమె బంగారు పతకం సాధిస్తుందని ప్రార్థనలు చేసింది. కానీ, ఈ ఆశలు అడియాశగానే మిగిలిపోయాయి. వినేశ్ ఫోగాట్ విషయంలో ఇలాంటి పొరపాటు జరగడం ఇదే మొదటిసారి కాదు.
గతంలో 2016లో కూడా ఆమెకు ఇలాంటి పరిస్థితి ఎదురైంది. ఆ సమయంలో రియో ఒలింపిక్స్‌కు ప్రపంచ ఒలింపిక్ క్వాలిఫయింగ్ ఈవెంట్ జరిగింది. దీనిలో వినేశ్ 48 కేజీల విభాగంలో పాల్గొన్నారు. అప్పుడు కూడా ఆమె బరువు 400 గ్రాములు ఎక్కువ కారణంగా అనర్హత వేటు పడింది. దీంతో 48 కేజీల విభాగంలో రియో ఒలింపిక్స్‌కు పంపే అవకాశాన్ని భారత్ కోల్పోయింది.
అయితే రియో ఒలింపిక్స్‌లో వినేశ్ మరో విభాగంలో పాల్గొన్నారు. అక్కడ కూడా ఆమె అద్భుతంగా ఆడారు. కానీ ఒక మ్యాచ్‌లో ఆమెకు మోకాలి గాయం కారణంగా ఆ ఒలింపిక్స్‌లో వినేశ్‌పై భారతదేశం ఆశలు వదులుకుంది. 2021 టోక్యో ఒలింపిక్స్‌లో వినేశ్ ఆటతీరు బాగాలేక టోర్నీ రెండో రౌండ్‌లోనే నిష్క్రమించింది.ఇలాంటి పరిస్థితుల్లో వినేష్‌తో మళ్లీ మళ్లీ ఇలా ఎందుకు జరుగుతుందనే ప్రశ్న తలెత్తుతోంది.
ఆ తర్వాత 2024 పారిస్ ఒలింపిక్స్ వస్తుందని యావత్ భారతీయులు ఆశలు పెట్టుకొన్నారు. ఇక్కడ కూడా ఫైనల్ మ్యాచ్‌కు ముందే ఆమెపై అనర్హత వేటు పడింది. దీంతో వినేశ్ కోచ్ లేదా మొత్తం మేనేజ్‌మెంట్‌లో ఏదైనా తప్పు ఉందా అని ప్రజలు చర్చించుకోవడం మొదలు పెట్టారు. కోట్లాది మంది ప్రజలను ఈ ఒలంపిక్స్ నిరాశపరిచాయని సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. అయితే ఒలంపిక్స్‌లో అనర్హత వేటు పడటం ఇదేమి మొదటిసారి కాదు. ఇదే విభాగంలో అధిక బరువు కారణంగా అనర్హత వేటు పడిన వారిలో మరో ఐదుగురు ఉన్నారు.
1. ఇమాన్యులా లియుజీ - ఇటలీ
2. కిమ్ సోన్‌హ్యాంగ్- ఉత్తర కొరియా
3. మెసౌడ్ రెడౌనే డ్రిస్ - అల్జీరియా
4. బాటిర్బెక్ సకులోవ్ - స్లోవేకియా
5. డానిలా సెమెనోవ్ - రష్యా
అయితే, వినేశ్ ఫోగాట్ ఈసారి ఒలింపిక్స్‌లో సెమీస్‌లో గెలిచి, ఫైనల్స్‌కు చేరుకున్నారు. గోల్డ్ లేదా సిల్వర్ మెడల్ ఖాయం అనుకున్న దశలో ఇలా జరగడం మొత్తం దేశాన్నే షాక్‌కు గురి చేసింది.