India vs England 1st Test: అశ్విన్ మాయాజాలం.. తక్కువ స్కోరుకే ఇంగ్లాండ్ ఆలౌట్
చెన్నై వేదికగా ఇంగ్లాండ్ భారత్ మధ్య జరుగుతున్నతొలి టెస్ట్ రెండో ఇన్నింగ్స్ టీమిండియా బౌలర్లు విజృంభించారు. టీమిండియా పేస్ ధాటికి ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ లో 178 పరుగులకే ఆలౌట్ అయింది. ఇంగ్లాండ్ కెప్టెన్ రూట్ (40 32బంతుల్లో, 7 ఫోర్ల)తో టాప్ స్కోరర్ గా నిలిచాడు. టీమిండియా బౌలర్లలో అశ్విన్ 6 వికెట్లతో అదగొట్టాడు. నదీమ్ 2, ఇషాంత్, బుమ్రా చెరో వికెట్ దక్కించుకున్నారు. ఈ మ్యాచ్ లో భారత్ విజయం సాధించాలంటే 420 పరుగలు చేయాలి. టీమిండియా పేస్ బౌలర్ ఇషాంత్ శర్మ రికార్డు సృష్టించాడు. ఇంగ్లండ్ బ్యాట్స్ మన్ డానియెల్ లారెన్స్ ను అవుట్ చేయడం ద్వారా ఇషాంత్ 300 వికెట్ల క్లబ్ లోకి చేరుకున్నాడు. భారత్ తరఫున ఈ ఫీట్ ఇంతకు ముందు ఇద్దరు ఫేస్ బౌలర్లు మాత్రమె సాధించారు. కపిల్ దేవ్, జహీర్ ఖాన్ తరువాత మూడొందల వికెట్లు సాధించిన ఫాస్ట్ బౌలర్ గా ఇషాంత్ ఇప్పుడు చరిత్ర సృష్టించాడు. ఇషాంత్ ఈ ఫీట్ ను 98 టెస్ట్ మ్యాచ్ లలో సాధించాడు.