SA vs IND: మూడో టీ20లో దక్షిణాఫ్రికాపై 11 పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయం.. ఇరగదీసిన తెలుగోడు..!

SA vs IND: భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య 4 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో మూడో మ్యాచ్ సెంచూరియన్‌లోని సూపర్‌స్పోర్ట్ పార్క్‌లో జరిగింది.

Update: 2024-11-14 02:06 GMT

SA vs IND: మూడో టీ20లో దక్షిణాఫ్రికాపై 11 పరుగుల తేడాతో ఘన విజయం.. ఇరగదీసిన తెలుగోడు..!

SA vs IND: భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య 4 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో మూడో మ్యాచ్ సెంచూరియన్‌లోని సూపర్‌స్పోర్ట్ పార్క్‌లో జరిగింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా గెలిచి సిరీస్‌లో 2-1 ఆధిక్యంలో నిలిచింది. ఈ మ్యాచ్ టీమ్ ఇండియాకు చాలా కీలకమైంది, ఎందుకంటే ఈ మ్యాచ్ గెలవడం ద్వారా టీమ్ ఇండియా సిరీస్ కోల్పోయే ప్రమాదాన్ని నివారించింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు ఆ తర్వాత బౌలర్లు విజయతీరాలకు చేర్చారు. ఈ మ్యాచ్‌లో యువ బ్యాట్స్‌మెన్ తిలక్ వర్మ టీమ్ ఇండియాకు స్టన్నింగ్ విక్టరీ అందించాడు. అతని బ్యాట్‌తో అద్భుతమైన సెంచరీ సాధించాడు.

ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా జట్టు టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకుంది. తర్వాత తాను తీసుకున్న నిర్ణయం తప్పని తేలిపోయింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది. ఈ సమయంలో తిలక్ వర్మ అత్యధికంగా 56 బంతుల్లో 107 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఈ క్రమంలో అతను 8 ఫోర్లు, 7 సిక్సర్లు బాదాడు. అతని అంతర్జాతీయ కెరీర్‌లో ఇదే తొలి సెంచరీ కూడా. తిలక్ వర్మతో పాటు అభిషేక్ శర్మ కూడా సత్తా ఏంటో చూపించాడు.

అతను 25 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్లతో 200 స్ట్రైక్ రేట్‌తో 50 పరుగులు చేశాడు. మరోవైపు హార్దిక్ పాండ్యా 18 పరుగులు, రమణదీప్ సింగ్ 15 పరుగుల సహకారం అందించారు. దక్షిణాఫ్రికా నుండి కేశవ్ మహారాజ్, ఆండిలే సిమెలనే ఈ మ్యాచ్‌లో అత్యంత విజయవంతమైన బౌలర్లుగా నిలిచారు. బౌలర్లిద్దరూ చెరో రెండు వికెట్లు తీశారు. మార్కో జాన్సన్ కూడా ఒక వికెట్ తీశాడు.

సెంచూరియన్‌లో భారత్‌కు తొలి విజయం

220 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 208 పరుగులకే ఆలౌటవగా, టీమిండియా 11 పరుగుల తేడాతో విజయం సాధించింది. హెన్రిచ్ క్లాసెన్, మార్కో జాన్సన్ మినహా దక్షిణాఫ్రికా నుండి మరే ఇతర బ్యాట్స్‌మెన్ ప్రత్యేకంగా ఏమీ చేయలేకపోయారు. మార్కో జాన్సన్ 17 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లతో 54 పరుగులు చేశాడు. హెన్రిచ్ క్లాసెన్ కూడా 22 బంతుల్లో 1 ఫోర్, 4 సిక్సర్ల సాయంతో 41 పరుగులు చేశాడు. కెప్టెన్ ఐడెన్ మార్క్రామ్ కూడా 29 పరుగులు మాత్రమే చేయగలిగాడు. రీజా హెండ్రిక్స్ 21 పరుగులు చేసి పెవిలియన్‌కు చేరుకున్నాడు.

మరోవైపు భారత్ తరఫున అర్ష్‌దీప్ సింగ్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి తలో వికెట్ తీశారు. అర్ష్‌దీప్ సింగ్ అత్యంత విజయవంతమైన బౌలర్. ముగ్గురు బ్యాట్స్‌మెన్‌లను అవుట్ చేశారు. వరుణ్ చక్రవర్తి కూడా ఇద్దరు బ్యాట్స్‌మెన్‌లను తన బంతితో లొంగదీసుకున్నాడు. దీంతో పాటు హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ చెరో వికెట్ తీశారు. దీంతో సెంచూరియన్‌లోని సూపర్‌స్పోర్ట్ పార్క్‌లో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో భారత జట్టు విజయం సాధించింది. ఇంతకుముందు ఈ మైదానంలో భారత జట్టు 1 టీ20 మ్యాచ్ ఆడగా, ఆ మ్యాచ్‌లో టీమిండియా ఓటమి చవిచూడాల్సి వచ్చింది.

Tags:    

Similar News