ICC Test Rankings : ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ జాబితా విడుదల.. టాప్ 20 నుంచి విరాట్ ఔట్
ICC Test Rankings: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) టెస్టు బ్యాట్స్‌మెన్ తాజా ర్యాంకింగ్స్‌ను విడుదల చేసింది. ఐసీసీ తాజాగా విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో టాప్-20లో విరాట్ కోహ్లీ చోటు దక్కించుకోలేకపోయారు. కోహ్లీతో పాటు బాబర్ ఆజం కూడా తన స్థానాన్ని జారవిడుచుకున్నారు. ఐసీసీ టెస్టు బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో విరాట్ కోహ్లీ ప్రస్తుతం 22వ స్థానానికి డ్రాప్ అయ్యాడు.
తాజా ర్యాంకింగ్స్‌లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ 26వ స్థానంలో ఉన్నాడు. పదేళ్ల తర్వాత ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో టాప్-20లో విరాట్ కోహ్లి ఔట్ కావడం గమనార్హం. అంతకుముందు, డిసెంబర్ 2014లో కూడా కోహ్లీ టాప్-20 బ్యాట్స్‌మెన్ జాబితాలో లేడు. ఆ తరువాత విరాట్ ఆధిపత్యం వరుసగా 10 సంవత్సరాలు కొనసాగింది. కానీ గత రెండేళ్లుగా ప్రదర్శన పేలవంగా ఉంది. దీని కారణంగా కోహ్లీ ర్యాంకింగ్ పడిపోతూ వచ్చింది.
తాజా ర్యాంకింగ్స్‌లో పాకిస్థాన్ ఆటగాడు బాబర్ అజామ్ కూడా భారీ నష్టాన్ని చవిచూశాడు. ప్రస్తుతం బాబర్ ఆజం 17వ స్థానానికి పడిపోయాడు. బాబర్ బ్యాట్ కూడా గత ఏడాది కాలంగా పెద్దగా రాణించిన సందర్భాలేవీ లేవు. ఈ కారణంగా అతడిని పాకిస్థాన్ టెస్టు జట్టు నుంచి కూడా తొలగించారు. గత 18 టెస్టుల్లో బాబర్ ఆజం ఒక్క అర్ధ సెంచరీ కూడా చేయలేకపోయాడు.
ఐసీసీ తాజా ర్యాంకింగ్స్‌లో ఇంగ్లండ్ ఆటగాడు జో రూట్ నంబర్ వన్ ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు. అతనికి 903 పాయింట్లు ఉన్నాయి. న్యూజిలాండ్‌కు చెందిన కేన్ విలియమ్సన్ రెండో స్థానంలో, ఇంగ్లాండ్‌కు చెందిన హ్యారీ బ్రూక్ మూడో స్థానంలో నిలిచారు. భారత యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ 777 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచాడు. ఆ తర్వాత ఆస్ట్రేలియాకు చెందిన స్టీవ్ స్మిత్ ఐదో ర్యాంక్‌లో ఉన్నాడు. అతనికి 757 పాయింట్లు ఉన్నాయి.
టాప్-10లో ఇద్దరు భారతీయులు
ఐసీసీ టెస్టు బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో టాప్-10లో ఇద్దరు భారత బ్యాట్స్‌మెన్‌లు చోటు దక్కించుకున్నారు. యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ నాలుగో స్థానంలో ఉన్నాడు. వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ ఆరో స్థానంలో ఉన్నాడు. పంత్‌కు 750 పాయింట్లు ఉన్నాయి. న్యూజిలాండ్‌కు చెందిన డారిల్ మిచెల్ ఏడో స్థానంలో, ఆస్ట్రేలియాకు చెందిన ఉస్మాన్ ఖవాజా ఎనిమిదో స్థానంలో, పాకిస్థాన్‌కు చెందిన సౌద్ షకీల్ 9వ స్థానంలో, ఆస్ట్రేలియాకు చెందిన మార్నస్ లాబుషాగ్నే 10వ స్థానంలో ఉన్నారు.