Former India Cricketer Chetan Chauhan passed away: భారత మాజీ క్రికెటర్ కన్నుమూత
Former India Cricketer Chetan Chauhan passed away: భారత మాజీ క్రికెటర్, యూపీ మాజీ లోక్‌సభ ఎంపీ చేతన్ చౌహాన్ కన్నుమూశారు. గతనెల 12న కరోనా బారినపడిన చేతన్ చౌహాన్..
Former India Cricketer Chetan Chauhan passed away: భారత మాజీ క్రికెటర్, యూపీ మాజీ లోక్‌సభ ఎంపీ చేతన్ చౌహాన్ కన్నుమూశారు. గతనెల 12న కరోనా బారినపడిన చేతన్ చౌహాన్.. మొదట కొన్ని రోజులు ఆయనను ఇంట్లోనే ఉంచి చికిత్స అందించారు. తర్వాత లక్నోలోని సంజయ్ గాంధీ ఆసుపత్రిలో చేరాడు. ఆరోగ్యం క్షీణించడంతో కుటుంబ సభ్యులు గుర్‌గ్రామ్‌లోని మేదాంత ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆదివారం సాయంత్రం తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
1947, జులై 21న జన్మించిన చేతన్ చౌహాన్ .. భారత జట్టు లోకి 1969లో ఏంట్రీ ఇచ్చారు. సునీల్ గావస్కర్‌కు సుదీర్ఘకాలం ఓపెనింగ్ భాగస్వామిగా ఆయన ఉన్నారు. 40 టెస్టులు ఆడారు. మహారాష్ట్ర, దిల్లీ తరఫున రంజీల్లో ఆడారు. అనంతరం ఢిల్లీ క్రికెట్ సంఘంలో అధ్యక్ష, ఉపాధ్యక్ష, కార్యదర్శి పదవుల్లో కొనసాగారు. ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా ఆయన భారత జట్టు మేనేజర్‌గానూ . నిఫ్ట్ ఛైర్మన్‌గానూ పనిచేశారు.
అనంతరం రాజకీయాల్లో చేరిన చేతన్ చౌహాన్.. యూపీలోని అమ్రోహా నుంచి 1991, 1998లో లోక్‌సభకు ఎన్నికయ్యారు. రాష్ట్ర రాజకీయాల్లోనూ చురుకైన పాత్ర పోషించారు. 2018, ఆగస్టు వరకు ఉత్తర్ ప్రదేశ్ క్రీడామంత్రిగా పనిచేశారు. చేతన్ చౌహాన్ ఆకస్మిక మరణం పట్ల రాజకీయ, క్రీడా ప్రముఖులు తీవ్ర సంతాపం తెలిపారు.
చేతన్ చౌహాన్ మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. చేతన్ చౌహాన్‌ను సమర్ధత కలిగిన రాజకీయ నేతగా అభివర్ణించారు. ప్రజాసేవలో ఎంతో చరుకుగా పని చేసి, ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ పటిష్టతకు కృషి చేశారని గుర్తుచేసుకున్నారు. చౌహాన్ ఇక లేరని తెలియడం ఆవేదనకు గురిచేస్తోంది. ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నాను' అని మోదీ ట్వీట్ చేశారు.