India vs England: 205 పరుగులకు ఇంగ్లాండ్ ఆలౌట్
India vs England: 4 వ టెస్టు మ్యాచ్ లో ఇంగ్లాండ్ తొలి ఇన్సింగ్స్‌లో 205 పరుగులకు ఆలౌట్ అయింది.
India vs England: నరేంద్ర మోడీ స్టేడియంలో నేటి నుంచి జరుగుతున్న 4 వ టెస్టు మ్యాచ్ లో ఇంగ్లాండ్ తొలి ఇన్సింగ్స్‌లో 205 (75.5 ఓవర్లకు) పరుగులకు ఆలౌట్ అయింది. ఇదే స్టేడియంలో జరిగిన మూడో టెస్టులో బ్యాటింగ్ లో ఘోరంగా విఫలమైన సంగతి తెలిసిందే. 4 వ టెస్టులో భారత బౌలర్లను తీవ్రంగా ప్రతిఘటించి బ్యాటింగ్ చేశారు. స్పిన్నర్ల దెబ్బకు 205 ఓవర్లలోనే చాప చుట్టేశారు ఇంగ్లీష్ ప్లేయర్స్.
టీమిండియాతో జరుగుతున్న నాలుగో టెస్టులో టాస్ గెలిచిన ఇంగ్లండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. మొదటి నుంచి బ్యాట్స్ మెన్స్ ఆచితూచి ఆడుతున్నారు. ఓ దశలో 30 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన జట్టును స్టోక్స్, బెయిర్ స్టోలు కలిసి చక్కదిద్దారు. స్టోక్స్ (55 పరుగులు), లార్వెన్స్ (46) పర్వాలేదనిపించారు. అలాగే పోప్ (29), బెయిర్ స్టో (28 పరుగులు) రాణించారు.
ఇక భారత బౌలర్ అక్షర్ పటేల్ తన హవా కొనసాగించాడు. అతడు వేసిన 71వ ఓవర్లో రెండు వికెట్లు పడ్డాయి. మొదటి బంతికి డేనియెల్ స్టంపౌట్ అవ్వగా నాలుగో బంతికి డామ్‌బెస్ (3) ఔటయ్యాడు. దీంతో అక్షర్ పటేల్ 4 వికెట్లు పడగొట్టి ఇంగ్లాండ్ ను కోలుకోలేని దెబ్బ తీశాడు. అలాగే అశ్విన్ కూడా రాణించి 3 వికెట్లు తీసి ఇంగ్లాండ్ బ్యాట్స్ మెన్స్ ని పెవిలియన్ పంపాడు. అలాగే సిరాజ్ 2 వికెట్లతో రాణించారు. సుందర్ ఒక వికెట్ తీశాడు.
కాగా నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో టీమిండియా ఇప్పటికే 2-1తో ముందంజలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగుతున్న ఆఖరి టెస్టు కీలకంగా మారింది. ఇక ఈ మ్యాచ్ గెలిచినా, కనీసం 'డ్రా' చేసుకున్నా వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌కు అర్హత సాధించే స్థితిలో భారత్ ఉంది.
మరోవైపు.. ఇప్పటికే ఆ అవకాశాలు కోల్పోయిన ఇంగ్లండ్ మాత్రం మొదటి మ్యాచ్ తరహాలో అసాధారణ ప్రదర్శనతో సిరీస్ సమం చేయాలని భావిస్తోంది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ గెలిస్తే ఆ జట్టు చిరకాల ప్రత్యర్థి ఆస్ట్రేలియాకు డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరే అవకాశం ఉంటుంది. కాగా ఇదే మైదానంలో జరిగిన పింక్‌బాల్ టెస్టులో టీమిండియా 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన విషయం విదితమే. అయితే ఈమ్యాచ్ అయితే రెండు రోజుల్లోనే ముగిసిపోవడంతో మొతేరా పిచ్ రూపొందించిన తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి.