IPL2020: రైనాపై సీఎస్‌కే ఓనర్ సంచలన వ్యాఖ్యలు
IPL 2020: యూఏఈ వేదికగా ఐపీఎల్ 2020 మరి కొద్ది రోజుల్లో ప్రారంభం కానున్నది. ఈ తరుణంలో చెన్నై ఆటగాళ్లకు కరోనా రావడం ఎదురుదెబ్బగా పరిణమించింది. ఈ క్రమంలోనే సురేశ్ రైనా ఆకస్మికంగా చెన్నై టీం నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే
IPL 2020: యూఏఈ వేదికగా ఐపీఎల్ 2020 మరి కొద్ది రోజుల్లో ప్రారంభం కానున్నది. ఈ తరుణంలో చెన్నై ఆటగాళ్లకు కరోనా రావడం ఎదురుదెబ్బగా పరిణమించింది. ఈ క్రమంలోనే సురేశ్ రైనా ఆకస్మికంగా చెన్నై టీం నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే.. ఈ విషయంపై చెన్నై సూపర్ కింగ్స్ ఓనర్ శ్రీనివాసన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 'క్రికెటర్లు పాత కాలం నాటి స్టార్లులాగా వ్యవహరిస్తుంటారు. కాస్తంత దూకుడుగా ఉంటారు. అయితే సీఎస్‌కే ఓ కుటుంబం లాంటింది. సీనియర్లందరూ కలసి మెలిసి ఉండటం నేర్చుకోవాలి. నా ఆలోచన ఏంటంటే.. నువ్వు సంతోషంగా లేవనుకుంటే వెళ్లిపోవచ్చు. ఇదే చేయాలని నేను ఎప్పుడు బలవంతం పెట్టను. కానీ ఒక్కోసారి విజయం నెత్తికెక్కుతుంది. తను ఎంత డబ్బు నష్టపోతున్నాడో రైనా త్వరలోనే తెలుసుకుంటాడు. అతడి వార్షిక ఆదాయం రూ.11 కోట్లను రైనా కోల్పోనున్నాడ'ని శ్రీనివాసన్ అన్నారు.
వ్యక్తిగత కారణాల వల్ల సురేశ్ రైనా ఐపీఎల్ నుంచి తప్పుకున్నాడని సీఎస్‌కే గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే తనకు కేటాయించిన గదిపై రైనా అంసతృప్తి వ్యక్తం చేశాడనే వార్త ఇటీవల కాలంలో తెగ వైరల్ అవుతోంది. చెన్నై సూపర్ కింగ్స్ క్యాప్టెన్ ధోనీకి ఇచ్చిన గది లాంటిదే తనకూ ఇవ్వాలని రైనా పట్టుబట్టాడనేది ఈ వార్తల సారాంశం. ఈ నేపథ్యంలోనే చెన్నై సూపర్ కింగ్స్ ఓనర్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
ఆగస్టు 21న రైనా జట్టుతో యూఏఈ చేరిన తరువాత దుబాయ్‌లో సీఎస్‌కే మేనేజ్‌మెంట్ తనకు ఇచ్చిన వసతి గది నచ్చకనే రైనా టోర్నీ నుంచి వెనుదిరిగినట్లు సమాచారం. రైనా గదిలో సరైన బాల్కనీలు లేవని, సురక్షిత వాతావరణం లేకనే రైనా అలిగి వెళ్లిపోయినట్లు తెలిసింది. మొదట వ్యక్తిగత కారణాల వల్ల రైనా వెళ్లిపోయాడనే వార్తలు వచ్చినా.. ఖచ్చితమైన కారణం ఇంకా తెలియరాలేదు. ఐపీఎల్ సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో మొదటి స్థానంలో విరాట్ కోహ్లి ఉండగా.. రెండో స్థానంలో రైనా ఉన్నాడు.