Marriage Rules: పెళ్లి సంబంధాలు చూస్తున్నారా.. జ్యోతిష్యం ప్రకారం కచ్చితంగా ఈ విషయాలు పరిశీలించాలి..!

Marriage Rules: పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో జరిగే ముఖ్యమైన తంతు. దీనికోసం యువతీ యువకులు రకరకాలు కలలు కంటారు.

Update: 2023-09-10 15:00 GMT

Marriage Rules: పెళ్లి సంబంధాలు చూస్తున్నారా.. జ్యోతిష్యం ప్రకారం కచ్చితంగా ఈ విషయాలు పరిశీలించాలి..!

Marriage Rules: పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో జరిగే ముఖ్యమైన తంతు. దీనికోసం యువతీ యువకులు రకరకాలు కలలు కంటారు. అయితే వివాహ బంధం కుదిర్చేటప్పుడు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని నియమాలని పాటించాలి. లేదంటే పెళ్లి జరిగినా ఆ దంపతులు కలిసి ఉండరు. అందుకే పెళ్లి సంబంధాలు చూసేముందు ఎలాంటి విషయాలని పరిగణలోనికి తీసుకోవాలో ఈరోజు తెలుసుకుందాం.

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం వివాహ సంబంధం కుదిర్చేటప్పుడు వధూవరులు ఒకే గోత్రీకులై ఉండరాదు. అలాగే జాతకాలను బట్టి, నక్షత్రాల ఆధారంగా వారి గుణమేనిక 36 మార్కులకు గాను కనీసం 20 మార్కులు వచ్చి ఉండాలి. ఇంకా జాతక బలాబలాలను పరిశీలించుకోవాలి. తర్వాత జాతకములో ఏవైనా దోషాలు ఉన్నాయా లేదా చెక్‌ చేసుకోవాలి. కుజదోషం, కాలసర్చదోషం, రాహు కేతు దోషం లాంటివి ఉంటే పరిహారం చేయాలి. ఇవన్నీ సరిగ్గా ఉంటే అప్పుడు వివాహ విషయంలో ముందుకు వెళ్లాలి.

ఇక పెళ్లి విషయానికి వస్తే ముహూర్తాలు నిర్ణయించడానికి ఉత్తరాయణం మంచి సమయం. ఇందులో చైత్ర, వైశాఖ, జ్యేష్ట మాఘ, ఫాల్గుణ మాసాలు ఉత్తమమైనవి. దక్షిణాయనంలో శ్రావణం, ఆశ్వయుజ మాసం, కార్తీక మాసం వివాహాలకు మధ్యస్థ ఫలితాలు ఉంటాయి. ఆషాఢం, భాద్రపదం, పుష్య మాసాలు వివాహాలకు పనికిరావు (నిషిద్ధం). అలాగే వివాహానికి బుధ, గురు, శుక్ర వారాలు మంచివి. ఆది, సోమ, శనివారాలు మధ్యమం. మంగళవారం నిషిద్ధం. వివాహానికి పనికి వచ్చే నక్షత్రాలలో అశ్చిని, రోహిణి, మృగశిర, మఖ, ఉత్తర, హస్త, చిత్త, అనూరాధ, ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట శతభిషం, ఉత్తరాభాద్ర, రేవతి నక్షత్రాలు ఉత్తమం.

Tags:    

Similar News