Daily Horoscope Today: నేటి మీ రాశి ఫలాలు ఇలా (1/1/2025)
Daily Horoscope Today In Telugu, January 1, 2025: నేటి రాశి ఫలాలు..12 రాశుల వారికి బుధవారం నాటి రాశిఫలాలు.
Daily Horoscope Today In Telugu, January 1, 2025: నేటి రాశి ఫలాలు..12 రాశుల వారికి బుధవారం నాటి రాశిఫలాలు.
మేషం
ఆత్మవిశ్వాసం వృద్ధి చెందుతుంది. అన్నింటా అనుకూల ఫలితాలు లభిస్తాయి. అవసరమైన డబ్బు అందుతుంది. అధికార వృద్ధి ఉంది. కుటుంబంలో ప్రశాంతత ఉంటుంది. ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు.
వృషభం
పనులకు ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. ఆధ్యాత్మిక ఆసక్తి పెరుగుతుంది. పుణ్యక్షేత్ర సందర్శన ఉంది. ఆరోగ్యంపై శ్రద్ధ పెడతారు. గొడవలకు దిగకండి. దూరప్రయాణం ఉంది. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి.
మిథునం
వ్యవహారాల్లో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. పనులు చెడిపోయే సూచన ఉంది. తొందరపాటు నిర్ణయాలు వద్దు. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి. అనవసరంగా పోటీల్లో దిగకండి. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.
కర్కాటకం
అభీష్ట సాధనలో జీవిత భాగస్వామి సహకారం లభిస్తుంది. శారీరక ఆనందం లభిస్తుంది. ఆర్థిక లావాదేవీలు తృప్తినిస్తాయి. ప్రయాణం లాభిస్తుంది. సంతాన వ్యవహారాలు ఆనందాన్నిస్తాయి. విందులో పాల్గొంటారు.
సింహం
అన్ని పనుల్లోనూ విజయం సాధిస్తారు. ధనలాభం ఉంది. ఆదాయ మార్గాలూ పెరుగుతాయి. మిత్రుల సహకారం లభిస్తుంది. కీర్తి పెరుగుతుంది. వివాదాలను పరిష్కరించుకుంటారు. అదృష్టం తోడుగా నిలుస్తుంది.
కన్య
పనులకు ఆటంకాలు ఏర్పడతాయి. బద్ధకం వీడి ఏకాగ్రతతో కష్టపడాలి. మీ ఆలోచనలు సవ్యంగా సాగవు. వాత సంబంధ సమస్య ఉంటుంది. విలువైన వస్తువులు, డాక్యుమెంట్లు జాగ్రత్త. అనవసర గొడవలు వస్తాయి.
తుల
బుద్ధి నిలకడగా ఉండదు. అయినవారితోనే గొడవలు వస్తాయి. తొందరపాటు నిర్ణయాల వల్ల కార్యనష్టం ఉంటుంది. ఒత్తిడి పెరుగుతుంది. ఆస్తి వ్యవహారాలను వాయిదా వేయండి. డబ్బుకి కాస్త ఇబ్బందిగా ఉంటుంది.
వృశ్చికం
పనుల్లో అనుకున్న రీతిలోనే ఫలితాలు లభిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు లాభాలనిస్తాయి. ధైర్యసాహసాలతో తీసుకునే నిర్ణయం అమితమైన శుభఫలితాన్నిస్తుంది. ఆత్మీయుల కలయిక నూతన ఉత్తేజాన్ని నింపుతుంది.
ధనుస్సు
మాట తప్పడం వల్ల నిందలు ఎదుర్కొంటారు. ఆర్థిక లావాదేవీలు ఏమాత్రం ఆశాజనకంగా ఉండవు. ఇతరుల కారణంగా ఇబ్బందుల్లో పడతారు. కుటుంబంలో చికాకులు వస్తాయి. అకారణ విరోధం ఏర్పడుతుంది.
మకరం
వ్యవహార జయం ఉంది. అభీష్టం సిద్ధిస్తుంది. ఆర్థికంగా చక్కటి ప్రయోజనాలను పొందుతారు. విద్య, ఉద్యోగ రంగాల్లో శుభ ఫలితాలు లభిస్తాయి. కొత్త బాధ్యతలను స్వీకరిస్తారు. కీర్తి ప్రతిష్టలు వృద్ధి చెందుతాయి.
కుంభం
పనులు సవ్యంగా సాగవు. ఆశించిన ప్రయోజనం సిద్ధించక పోవడం వేదనకు గురి చేస్తుంది. దూర ప్రయాణం గోచరిస్తోంది. వేళకు భోజనముండదు. వృథా ఖర్చులను తగ్గించాలి. నిద్రలేమి వేధిస్తుంది. ఆరోగ్యం జాగ్రత్త.
మీనం
రోజంతా ఉల్లాసంగా గడుస్తుంది. ఇష్టకార్యం సిద్ధిస్తుంది. ధనలాభం ఉంది. ఆత్మీయులతో విందులో పాల్గొంటారు. కుటుంబ వ్యవహారాలు సంతృప్తినిస్తాయి. సంతాన సంబంధ వ్యవహారాలు ఆనంద పరుస్తాయి.