Daily Horoscope Today: నేటి మీ రాశి ఫలాలు ఇలా (25/12/2024)
Daily Horoscope Today In Telugu, December 25, 2024: నేటి రాశి ఫలాలు..12 రాశుల వారికి బుధవారం నాటి రాశిఫలాలు.
Daily Horoscope Today In Telugu, December 25, 2024: నేటి రాశి ఫలాలు..12 రాశుల వారికి బుధవారం నాటి రాశిఫలాలు.
కాలాదులు: శ్రీ క్రోధి నామ సంవత్సరం, మార్గశిర మాసం, దక్షిణాయనం, హేమంత రుతువు, కృష్ణ పక్షం
తిధి: దశమి రాత్రి గం.10.29 ని.ల వరకు ఆ తర్వాత ఏకాదశి
నక్షత్రం: చిత్త మధ్యాహ్నం గం 3.22 ని.ల వరకు ఆ తర్వాత స్వాతి
అమృతఘడియలు: ఉదయం గం.8.09 ని.ల నుంచి గం.9.57 ని.ల వరకు
వర్జ్యం: రాత్రి గం.9.37 ని.ల నుంచి గం.11.24 ని.ల వరకు
దుర్ముహూర్తం: ఉదయం గం.11.54 ని.ల నుంచి మధ్యాహ్నం గం.12.39 ని.ల వరకు
రాహుకాలం: మధ్యాహ్నం గం.12.10 ని.ల నుంచి గం.1.40 ని.ల వరకు
సూర్యోదయం: తె.వా. గం. 6.42 ని.లకు
సూర్యాస్తమయం: సా. గం. 5.47ని.లకు
మేషం
భాగస్వామ్య వ్యవహారాలు శుభప్రదంగా సాగుతాయి. వివిధ రకాల బంధాలు బలపడతాయి. ధనలాభం ఉంది. కొత్త విషయాలను తెలుసుకుంటారు. నిజాయితీకి తగిన గుర్తింపు ఉంటుంది. ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు.
వృషభం
వివాదాలు తొలగిపోతాయి. ప్రత్యర్థుల బెడద తగ్గుతుంది. వ్యవహారాల్లో విజయం లభిస్తుంది. శారీరక సమస్య దూరమవుతుంది. మిత్రుల సహకారంతో అభీష్టాన్ని నెరవేర్చుకుంటారు. ధనలాభం ఉంది. కీర్తి పెరుగుతుంది.
మిథునం
ఇష్ట కార్య పూర్తికి బాగా శ్రమించాల్సి వుంటుంది. అడ్డంకులు సృష్టించేవారు పెరుగుతారు. సవ్యంగా ఆలోచించ లేకపోతారు. సమస్యల పరిష్కార క్రమంలో ప్రియతముల సూచనలను పాటించండి. గొడవలకు దిగకండి.
కర్కాటకం
పనులు ఆశించిన స్థాయిలో జరగవు. విచారం కలుగుతుంది. బుద్ధి నిలకడగా ఉండదు. బంధువులతో విరోధం ఏర్పడుతుంది. డబ్బుకి ఇబ్బందిగా ఉంటుంది. రక్తసంబంధీకుల గురించిన సరికొత్త విషయాలు తెలుస్తాయి.
సింహం
అందరి సహకారం అందుతుంది. అభీష్టం నెరవేరుతుంది. ధనాదాయం వృద్ధి చెందుతుంది. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. ఇరుగుపొరుగుతో సఖ్యత పెరుగుతుంది. సమాచార రంగంలోని వారికి బాగా మెరుగ్గా ఉంటుంది.
కన్య
ఇచ్చిన మాటను నిలుపుకోలేరు. నిందను భరించాల్సి వస్తుంది. అనుకున్నవి జరగక వేదనకు గురవుతారు. ఇతరుల వల్ల సమస్యలు వస్తాయి. కంటికి సంబంధించిన ఇబ్బంది ఉంటుంది. తగాదాలకు దూరంగా ఉండండి.
తుల
అదృష్టం తోడుంటుంది. ప్రతి పనీ శుభప్రదం అవుతుంది. కుటుంబ సౌఖ్యాన్ని పొందుతారు. ఎదుగుదలకు సంబంధించిన ప్రయత్నాలకు పెద్దవారి సహకారం లభిస్తుంది. కీర్తి పెరుగుతుంది. మనశ్శాంతి ఉంటుంది.
వృశ్చికం
వ్యవహార నష్టం గోచరిస్తోంది. అప్రమత్తంగా ఉండండి. తొందరపాటు నిర్ణయాలు వద్దు. ఇతరులతో జాగ్రత్తగా ఉండండి. అనవసర ప్రయాణాలు మానుకోండి. బాధ్యతల నుంచి తప్పుకోవాల్సి రావచ్చు. బద్ధకం వదలండి.
ధనుస్సు
ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇతరుల నుంచి సహకారం లభిస్తుంది. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా ఉంటాయి. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. సంతాన సంబంధ వ్యవహారాలు సంతృప్తినిస్తాయి. విందులకు హాజరవుతారు.
మకరం
ఇష్టకార్యసిద్ధికి అనుకూల పరిస్థితులు ఉన్నాయి. ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. ఆత్మవిశ్వాసం వృద్ధి చెందుతుంది. అవకాశాలను చేజార్చుకోకండి. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. పెద్దల ఆశీస్సులను పొందుతారు.
కుంభం
పనులు అనుకున్న రీతిలో సాగవు. డబ్బుకి ఇబ్బంది ఉండదు. ఇంటికి దూరంగా గడుపుతారు. పెద్దలను కలుస్తారు. కోర్టు వ్యవహారాల్లో జాగ్రత్త. సంతానం తీరును విభేదిస్తారు. భవిష్యత్ గురించిన ఆలోచన చేస్తారు.
మీనం
ప్రతి నిర్ణయాన్నీ ఆచితూచి తీసుకోవాలి. తగాదాలకు దూరంగా ఉండాలి. నిర్లక్ష్యం కారణంగా పెద్దల కోపానికి గురవుతారు. ఆర్థికంగా చిక్కుంటుంది. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.