రాశిఫలం 24-12-2024 (మంగళ వారం)

Update: 2024-12-24 00:29 GMT

రాశిఫలం

24-12-2024 (మంగళ వారం)

కాలాదులు: శ్రీ క్రోధి నామ సంవత్సరం, మార్గశిర మాసం, దక్షిణాయనం, హేమంత రుతువు, కృష్ణ పక్షం

తిధి : నవమి సాయంత్రం గం.7.52 ని.ల వరకు ఆ తర్వాత దశమి

నక్షత్రం: హస్త మధ్యాహ్నం గం.12.17 ని.ల వరకు ఆ తర్వాత చిత్త

అమృతఘడియలు: లేవు

వర్జ్యం: రాత్రి గం.9.19 ని.ల నుంచి గం.11.07 ని.ల వరకు

దుర్ముహూర్తం : ఉదయం గం.8.56 ని.ల నుంచి గం. 9.41 ని.ల వరకు మళ్లీ రాత్రి గం.10.59 ని.ల నుంచి గం.11.50 ని.ల వరకు

రాహుకాలం : మధ్యాహ్నం గం.3.00 ని.ల నుంచి గం. 4.31 ని.ల వరకు

సూర్యోదయం : తె.వా. గం. 6.41 ని.లకు

సూర్యాస్తమయం :సా. గం. 5.46 ని.లకు

మేషం :

శుభ ఫలితాలుంటాయి. ఆర్థిక వ్యవహారాలు లాభసాటిగా ఉంటాయి. సందేహాలు తొలగిపోతాయి. బంధువుల సహకారంతో కీలక కార్యం సఫలం అవుతుంది. వస్త్రాభరణాలను కొంటారు. ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు.

వృషభం :

పనులకు ఆటంకాలు ఎదురవుతాయి. కీలక వ్యవహారంలో మిత్రుల సూచన పాటించడి. ప్రేమ వ్యవహారాలు ఫలించవు. సంతానం తీరు చికాకు పెడుతుంది. పొట్టలో వాత సంబంధ సమస్య వస్తుంది. బద్ధకాన్ని వదలాలి.

మిథునం :

అనుకున్న స్థాయిలో పనులు సాగవు. ఆదాయానికి మించిన ఖర్చులుంటాయి. భూ సంబంధ లావాదేవీల్లో జాగ్రత్తగా ఉండాలి. వాహన సంబంధంగా పరిహారం చెల్లించాల్సి రావచ్చు. తల్లి ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి.

కర్కాటకం:

కార్యనిర్వహణలో సఫలం అవుతారు. ధనాదాయం పెరుగుతుంది. మీరు సూచించే ఉపాయానికి చక్కటి ప్రశంసలొస్తాయి. ఆనందకరమైన సమాచారం అందుతుంది. ఆరోగ్యం బావుంటుంది. మనశ్శాంతి లభిస్తుంది.

సింహం :

అనవసర జోక్యాల వల్ల సమస్యలు వస్తాయి. పైగా పనులూ చెడిపోతాయి. అడ్డంకులు సృష్టించే వారు ఎక్కువ అవుతారు. వేళకు భోజనముండదు. ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్త. కుటుంబ వ్యవహారాలపై దృష్టి పెట్టాలి.

కన్య :

ఉల్లాసంగా గడుపుతారు. ధనలాభం ఉంది. విందు, వినోదాల్లో పాల్గొంటారు. కొత్త బాధ్యతల్లో ఒదిగిపోతారు. ఇంటికి కావాల్సిన సౌకర్యాలను ఏర్పరచుకుంటారు. బాల్యస్నేహితులను కలుస్తారు. ఆరోగ్యం బావుంటుంది.

తుల :

ఇతరులతో జాగ్రత్తగా ఉండండి. మీ పనిని చెడగొడతారు. ఇంటికి దూరంగా వెళ్లే సూచన ఉంది. వివాదాలను పరిష్కరించుకునే ప్రయత్నం ఫలించదు. వృథా ప్రయాణాలు మానుకోవాలి. అనవసర పోటీల్లో పాల్గొనకండి.

వృశ్చికం :

ఆకాంక్ష నెరవేరుతుంది. ఆర్థికంగా లబ్దిని పొందుతారు. ఆనందం పెరుగుతుంది. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. సంతాన సంబంధ వ్యవహారాలు తృప్తినిస్తాయి. ఇతరుల సహకారమూ లభిస్తుంది. శుభకార్యాల్లో పాల్గొంటారు.

ధనుస్సు :

అన్ని పనుల్లో విజయం సాధిస్తారు. కుటుంబంలో శాంతియుత వాతావరణం ఉంటుంది. నైపుణ్యానికి తగ్గ అవకాశాలను సద్వినియోగం చేసుకోండి. ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.

మకరం :

పనులకు ఆటంకాలు ఎదురవుతాయి. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి. బాధ్యతల నుంచి వైదొలగాల్సి రావచ్చు. వృథా ప్రయాణం మానండి. త్వరగా అలసిపోతారు. ఆధ్యాత్మకి అంశాలపై ఆసక్తి పెరుగుతుంది.

కుంభం :

వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. చెప్పుడు మాటలను నమ్మకండి. విధి నిర్వహణలో జాగ్రత్తగా లేకుంటే పెద్దల కోపానికి గురవుతారు. కోపాన్ని తగ్గించుకోండి. వేళకు భోజనముండదు. జీర్ణ సంబంధ సమస్య ఉంటుంది.

మీనం :

ఉల్లాసంగా గడుస్తుంది. ఆర్థిక లావాదేవీలు తృప్తినిస్తాయి. భాగస్వామ్య వ్యవహారాలు లాభసాటిగా ఉంటాయి. జీవిత భాగస్వామి సూచనలను పాటించండి. నిజాయితీకి తగ్గ ఫలం లభిస్తుంది. మనశ్శాంతిని పొందుతారు.

శుభమస్తు

Tags:    

Similar News