రాశిఫలం
21-12-2024 (శనివారం)
కాలాదులు: శ్రీ క్రోధి నామ సంవత్సరం, మార్గశిర మాసం, దక్షిణాయనం, హేమంత రుతువు, కృష్ణ పక్షం
తిధి : షష్ఠి మధ్యాహ్నం గం.12.21 ని.ల వరకు ఆ తర్వాత సప్తమి
నక్షత్రం: పుబ్బ ఉదయం గం.6.14 ని.ల వరకు ఆ తర్వాత ఉత్తర
అమృతఘడియలు: రాత్రి గం.11.11 ని.ల నుంచి అర్ధరాత్రి గం.12.57 ని.ల వరకు
వర్జ్యం: మధ్యాహ్నం గం.12.36 ని.ల నుంచి గం.2.23 ని.ల వరకు
దుర్ముహూర్తం :ఉదయం గం.6.42 ని.ల నుంచి గం.8.10 ని.ల వరకు
రాహుకాలం : ఉదయం గం.9.28 ని.ల నుంచి గం.10.51 ని.ల వరకు
సూర్యోదయం : తె.వా. గం. 6.40 ని.లకు
సూర్యాస్తమయం :సా. గం.5.45 ని.లకు
మేషం :
సామాజిక గౌరవాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తారు. కార్యనిర్వహణలో విఫలమవుతారు. అభీష్టం నెరవేరదు. చెడు ఆలోచనలను నియంత్రించుకోండి. వాత సంబంధ సమస్య ఉంటుంది. గొడవలకు దూరంగా ఉండండి.
వృషభం :
బుద్ధి నిలకడగా ఉండదు. డబ్బుకి ఇబ్బందిగా ఉంటుంది. రక్తసంబంధీకుల గురించిన సమాచారం వస్తుంది. ఒత్తిడి పెరుగుతుంది. తల్లి ఆరోగ్యం జాగ్రత్త. వాహన సంబంధ సమస్య ఉంటుంది. మనశ్శాంతి లోపిస్తుంది.
మిథునం :
ధనాదాయం వృద్ధి చెందుతుంది. నూతన వస్త్రాభరణాలను కొంటారు. ధైర్యసాహసాలతో చేపట్టే ప్రతి పనీ సఫలమవుతుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది.
కర్కాటకం:
తగాదాలకు ఆస్కారం ఉంది. నోటిని అదుపులో ఉంచుకోండి. ఆర్థిక లావాదేవీలు నిరాశను కలిగిస్తాయి. కుటుంబంలో చిక్కులు ఏర్పడతాయి. కీర్తికి భంగం ఏర్పడే సూచన ఉంది. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి.
సింహం :
భాగ్యవంతంగా సాగుతుంది. అభీష్టం నెరవేరుతుంది. ఆదాయం పెరుగుతుంది. వాహన సౌఖ్యం ఉంది. కుటుంబ వ్యవహారాలు తృప్తినిస్తాయి. పురోభివృద్ధికి చేసే ప్రయత్నం ఫలిస్తుంది. మనశ్శాంతి లభిస్తుంది.
కన్య :
అనవసర వ్యవహారాల్లో తలదూర్చకండి. ముఖ్యంగా గిట్టని వారు చెప్పే మాటలను పట్టించుకోకండి. ధననష్టం గోచరిస్తోంది. వేళకు భోజనం ఉండదు. మిత్రులే విరోధులుగా ప్రవర్తించే వీలుంది. దూర ప్రయాణం ఉంది.
తుల :
అభీష్టం నెరవేరుతుంది. ఆర్థిక లావాదేవీలు తృప్తినిస్తాయి. సంతాన సంబంధ శుభకార్యాలు నిర్వహిస్తారు. కొత్త పరిచయాలు లాభసాటిగా ఉంటాయి. కొత్త వస్తువులను సేకరిస్తారు. పెద్దల ఆశీస్సులను పొందుతారు.
వృశ్చికం :
కోరిక నెరవేరుతుంది. అన్నింటా అనుకూలంగా ఉంటుంది. అధికార వృద్ధి ఉంది. కుటుంబంలో శాంతి ఉంటుంది. ఆశించిన సౌఖ్యాలను పొందుతారు. నిపుణతకు తగ్గ గుర్తింపు లభిస్తుంది. మనశ్శాంతి లభిస్తుంది.
ధనుస్సు :
కార్యసాధనలో అడ్డంకులను దాటాల్సి వుంటుంది. ఆశించిన ఆర్థిక ప్రయోజనాలు లభించవు. అవసరమైన సమయంలో ఆత్మీయులు ముఖం చాటేస్తారు. భవిష్యత్ ప్రణాళికలను రచిస్తారు. దైవచింతన పెరుగుతుంది.
మకరం :
విధి నిర్వహణలో నిర్లక్ష్యం వల్ల పెద్దల కోపానికి గురవుతారు. అనుకున్నట్లుగా పనులు సాగవు. ఇష్టంలేని పని చేయాల్సి వస్తుంది. సౌకర్యాల లేమి బాధను కలిగిస్తుంది. తగాదాలకు దూరంగా ఉండండి. ఆరోగ్యం జాగ్రత్త.
కుంభం :
వ్యవహార జయం ఉంది. అభివృద్ధి దిశగా సాగుతారు. ఆర్థిక క్రమశిక్షణ అలవాటు అవుతుంది. కొత్త విషయాలు తెలుస్తాయి. ప్రయాణం ఆనందకరంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో సఖ్యత ఉంటుంది. కీర్తి పెరుగుతుంది.
మీనం :
బలహీనతలను జయిస్తారు. వివాదాలు పరిష్కారం అవుతాయి. అపార్థాలు పోతాయి. వ్యవహారాల్లో విజయం లభిస్తుంది. ధనలాభం ఉంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. బంధువులతో పుణ్యకార్యాల్లో పాల్గొంటారు.
శుభమస్తు